Home Filmy Adda ఆర్తి అగర్వాల్ తో తరుణ్ ప్రేమ.? రోజారమణి గారు సంచలన కామెంట్స్.!

ఆర్తి అగర్వాల్ తో తరుణ్ ప్రేమ.? రోజారమణి గారు సంచలన కామెంట్స్.!

by Megha Varna

కాలేజ్ చదువులు పూర్తవ్వగానే సినిమాలోకి వచ్చి స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన తరుణ్ ఆతర్వాత కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అందరికంటే వెనకపడిపోయారు.సినీ కుటుంబం నుండి వచ్చిన తరుణ్ కెరీర్ స్టార్టింగ్ నుండి అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అందువల్లే అప్పట్లో తన మీద చాలా రూమర్స్ వచ్చాయి.వాటిని తరుణ్ చాలా లైట్ తీసుకునేవాడు ఎంతలా అంటే అవి తనకి చూపించి మరి నవ్వేవాడని రోజారమణి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకు తరుణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

ఆదిత్య369,అంజలి,పిల్లలు దిద్దన కాపురం వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి బాల నటుడిగా సక్సెస్ అయిన తరుణ్. ఆతర్వాత చదువులు పూర్తి చేసుకొని నువ్వే కావాలి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

డెబ్యూ మూవీతో ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాసిన తరుణ్, అందరి దృష్టిని ఆకర్షించాడు. కాలేజిలో ఫ్రెండ్స్ తో ఉన్నట్టు తన సినిమాలలో నటించే కో- స్టార్స్ తో పార్టీలకు,షాపింగ్ లకు వెళ్ళతుండేవాడు.అందువల్లనే తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువని రూమర్స్ వచ్చాయి.

ఇక ఆర్తి అగర్వాల్ ను నేను కేవలం రెండు సార్లు మాత్రమే కలిశాను ఆమె చాలా సైలెంట్ గా ఉండేది.అలాంటి అమ్మాయి సడన్ గా సూసైడ్ చేసుకోవాలి అనుకోవడం దానికి నిజానిజాలు తెలుసుకోకుండా తరుణ్ కారణమని మీడియా రాయడం నాకు బాధ కలిగించింది.తరుణ్ ఒకవేళ తనని ఇష్టపడి ఉంటే మాకు తన గురించి చెప్పేవాడు.కాని మాకెప్పుడు తరుణ్ తన గురించి చెప్పలేదు.కారణాలు తెలుసుకోకుండా తమ రేటింగ్స్ కోసం మీడియా సంస్థలు ఇలాంటి వార్తలు రాసినప్పుడు మా కుటుంబం అంతా బాధపడిందని రోజారమణి అన్నారు.

https://youtu.be/YhH0Mh0Lnbc

You may also like