దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ రెండవ త్రైమాసిక ఫలితాలను బుధవారం నాడు ప్రకటించారు. నికర లాభం భారీగా పెరిగి, రూ. 11,342 కోట్లుగా నమోదైంది. ఇదే విధంగా రూ. 17 వేల కోట్ల వాల్యూ షేర్ల బైబ్యాక్‌ ను ప్రకటించింది. ఒక్కో షేర్ కు రూ.4150 కాగా, రూ. 9 డివిడెండ్ ఒక్కో షేరు పై ప్రకటించింది.

Video Advertisement

అయితే ఫలితాల ప్రకటనతో పాటు షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది. రెండవ త్రైమాసికంలో ఈ సంస్థ ఉద్యోగుల సంఖ్య 6,333 తగ్గినట్టుగా తెలిపింది. టీసీఎస్ అట్రిషన్ రేటు కూడా త్రైమాసికంలో 14.9శాతానికి తగ్గిపోయింది.
ఐటీ మేజర్ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2024 రెండవ త్రైమాసికంలో  6,333 మంది ఉద్యోగుల తగ్గి, మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కి చేరుకుంది. అయితే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 7,186 తగ్గింది. టీసీఎస్ మొదటి త్రైమాసికంలో కేవలం 523 మంది ఉద్యోగుల్ని మాత్రమే కొత్తగా తీసుకుంది. అయితే  ఉద్యోగుల వలసలు (అట్రిషన్ రేటు) 17.8 శాతం – 14.9 శాతానికి తగ్గిపోయింది.
టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గుదలతో ఐటీలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో అయితే ఉద్యోగుల సంఖ్య వరుసగా పెరుగుకుంటూ వెళ్ళేది. ఈ కంపెనీలో సగానికిపైగా ఉద్యోగులు దాదాపు 2020 తర్వాత చేరారని తెలుస్తోంది.  కానీ ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గుకుంటూ వెళ్తోందంటే ఇది ఐటీ రంగానికే ప్రమాదం అని తెలుస్తోంది. ఇక ఐదే విధంగా ఇతర ఐటీ సంస్థలు అయిన ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రోలో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గేపోయే  ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ అయిన అసెంచర్ ఇటీవల ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. కేవలం 951 మంది ఎంప్లాయీస్ ను మాత్రమే కొత్తగా తీసుకున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల వల్లనే ఈ విధంగా జరుగుతున్నట్లుగా పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: టికెట్ లేకుండా “వందే భారత్ ఎక్స్‌ప్రెస్” ఎక్కిన పోలీస్..! కానీ ఆ తరువాత ఏం జరిగిందంటే..?