చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో వినిపించిన వాదనలు ఏమిటంటే..?

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో వినిపించిన వాదనలు ఏమిటంటే..?

by kavitha

Ads

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ పై నేడు సుప్రీంకోర్టులో వాదనలు సీరియస్ గా జరిగాయి. ఆ తరువాత ఈ కేసు విచారణను శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Video Advertisement

శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు తదుపరి విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. అయితే ఈరోజు (మంగళవారం) ఇరుపక్షాల లాయర్లు హోరాహోరీగా తమ వాదనలు వినిపించారు. ఏపీ గవర్నమెంట్ తరఫున లాయర్ ముకుల్ రోహత్గి, చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ కేసులో ముఖ్యంగా సెక్షన్ 17A చుట్టూ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్ హరీశ్‌ సాల్వే 17A సెక్షన్‌కు చెందిన వివిధ అంశాలు, గతంలో కొన్ని కేసుల్లో ఇచ్చిన తీర్పుల గురించి ధర్మాసనం ముందు ఉంచారు. వాటిలో రఫేల్‌ కొనుగోళ్ల విషయంలో యశ్వంత్‌ సిన్హా వేసిన పిటిషన్‌, అలాగే రఫేల్‌ కేసులో ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ముందు ఉంచారు. రఫేల్‌ కొనుగోళ్ల పై 2019లో యశ్వంత్‌ సిన్హా వేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ డిస్మిస్ చేసిన విషయాన్ని కోర్టుకు గుర్తుచేశారు.
బుల్లర్ కేసుతో పాటు పలు కేసులలో తీర్పులను వివరించిన సాల్వే, స్కిల్‌ కేసులో చంద్రబాబు నాయుడు పై రిజిస్టర్ అయిన ఎఫ్‌ఐఆర్‌ చట్టబద్ధం కాదని అన్నారు. ఈ కేసులో బుల్లర్ కేసులో ఇచ్చిన తీర్పును  పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నానని ధర్మాసనాన్ని సాల్వే కోరారు. చంద్రబాబు పై రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్‍ ను తాను సవాల్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. దానిలో ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరు లేదని సాల్వే వాదించారు. ఆ తరువాత ఏపీ సీఐడీ తరఫున లాయర్ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.
రోహత్గీ వాదిస్తూ, 2018కి ముందు కొంతవరకు విచారణ జరిగి ఆగిపోయిందని, అంతేకాని విచారణ జరగలేదని కాదని వాదించారు. హైకోర్టులో విచారణ పూర్తి అయ్యాక పత్రాలు ఇచ్చామని, దానిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. 2018 చట్ట సవరణ చేసిన అనంతరం చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చితే, దానిని రాజకీయ ప్రతీకార చర్యగా వ్యవహరించకూడదని అన్నారు.
చంద్రబాబు మీద తగిన ఆధారాలు లభించిన అనంతరం 2021లో కేసు రిజిస్టర్ చేశారని, ఈ కేసులో ఆయనను ఎప్పుడు చేర్చినా కూడా విచారణ కొనసాగుతున్నట్లుగా పరిగణించాలని కోర్టులో వాదించారు. ఇక నేరం ఎప్పుడు జరిగిందో, అప్పుడు ఉన్న చట్టం ప్రకారంగానే  విచారణ చేయాలని సుప్రీం కోర్టు ముందుకు తీసుకెళ్లారు. తదుపరి విచారణను సుప్రీం కోర్టు శుక్రవారంకు వాయిదా వేసింది.

Also Read: చంద్రబాబు నాయుడు లాయర్ కోర్టులో వినిపించిన వాదనలు ఏంటి..? అసలు ఏం జరిగిందంటే..?

 


End of Article

You may also like