Ads
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో ఎన్నో నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో కూడా ఎవరు గెలుస్తారు అనే ఆసక్తి నెలకొంది. వైసీపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య పోరు సాగింది. చివరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.ఎస్. రాజు 351 ఓట్ల తేడాతో గెలిచారు. ఎంఎస్ రాజుకి 79983 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుండి బరిలోకి దిగిన ఈర లక్కప్పకి 79632 ఓట్లు వచ్చాయి. ఈర లక్కప్ప గతంలో ఉపాధి హామీ ఉద్యోగిగా పని చేశారు. ఒక సామాన్య కార్యకర్తని ఈసారి వైసీపీ బరిలోకి నిలిపారు.
Video Advertisement
ఎన్నికల కౌంటింగ్ మొదలైన తర్వాత నుండి కూడా ఎవరు గెలుస్తారు అనే విషయం మీద స్పష్టత రాలేదు. ఒక రౌండ్ లో ఒకరు ముందు ఉంటే, తర్వాత రౌండ్ లో మరొకరు ముందు ఉన్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.ఎస్. రాజు 351 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మంచి స్థాయిలో ఓట్లని దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన సుధాకర్, దాదాపు 17 వేల ఓట్లు దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడంతో అందరి ఇళ్లల్లో సంబరాలు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా కుటుంబం అంతా వచ్చి వేడుకలు జరుపుకున్నారు. పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా గెలిచారు.
చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో జరిగిన వేడుకలకి నారా కుటుంబం అంతా కూడా హాజరు అయ్యారు. అలాగే, పవన్ కళ్యాణ్ ఇంట్లో కూడా సెలబ్రేషన్స్ చేశారు. నాగబాబు ఈ సెలబ్రేషన్స్ లో పాలుపంచుకున్నారు. ఈ ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ భార్య అనా అందరి ముందుకు వచ్చి థాంక్యూ అని చెప్పారు. అనాతో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కూడా వచ్చి థాంక్యూ అని చెప్పాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి అనా కుంకుమ తిలకం పెట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, అకిరా వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా నిన్న సాయంత్రం అందరి ముందుకు వచ్చి మాట్లాడి, గొడవలకి ఇది సమయం కాదు అని అన్నారు. తర్వాత చేయబోయే పథకాల గురించి వివరిస్తాం అని చెప్పారు.
End of Article