60 సంవత్సరాల నుండి 26 సమాధుల మధ్య టీ కొట్టు… తాగినోళ్ళు లక్కీ..!

60 సంవత్సరాల నుండి 26 సమాధుల మధ్య టీ కొట్టు… తాగినోళ్ళు లక్కీ..!

by Megha Varna

Ads

కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో విచిత్రాలు కనబడుతూ ఉంటాయి వాటిని నమ్మడానికి కూడా మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ అవి నిజంగా జరుగుతూ ఉండే విషయాలు అవ్వచ్చు. పైగా కొన్ని భయంకరమైన విషయాలు కూడా మనకి సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.

Video Advertisement

మామూలుగా శ్మశానం అంటే మనందరికీ భయం వేస్తుంది ముఖ్యంగా చీకటి పడ్డాక స్మశానంపేరు ఎత్తితే చాలు మనకి వణుకు పుడుతుంది కానీ ఒక వ్యాపారి మాత్రం 26 సమాధుల మధ్య టీ కొట్టు ని నడుపుతున్నాడు.

ఏమిటి స్మశానవాటిక మధ్యలో టీ కొట్టు అని ఆశ్చర్యపోకండి.. నిజంగానే స్మశానం మధ్యలో ఒక వ్యక్తి టీ కొట్టు నడుపుతున్నాడు. మరి ఇక పూర్తి వివరాల్లోకి వెళితే …60 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి 26 సమాధుల మధ్య టీ కొట్టు ని నడుపుతున్నాడు. పైగా ఈ టీ తాగితే అదృష్టం వస్తుందని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ టీ కొట్టు ఉంది ఒక స్మశానవాటికలో ఈ ముస్లిం వ్యాపారి రన్ చేస్తున్నాడు. దీని పేరు లక్కీ టీ స్టాల్. ఈ హోటల్లో సమాధులకి అటు ఇటు బల్లలు ఉంటాయి.

ఈ బల్లల మీద శాకాహారం మాత్రమే వడ్డిస్తారు. రోజు ఈ టీ కొట్టు లో ఉండే సమాధులను క్లీన్ చేస్తారు. పైగా వాటి మీద పూలని కూడా ఉంచుతారు. మొదట్లో ఈ టీ కొట్టు యజమాని అబ్దుల్ రజాకా మన్సూరి బండి మీద టీ అమ్ముతూ ఉండేవాడు. క్రమంగా వ్యాపారం పెరగడం వలన సమాధుల మధ్యనే టీ కొట్టు నడపడం మొదలుపెట్టాడు. ఆరు దశాబ్దాల నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేస్తున్నాడు. ఈ కొట్టు కి రాడానికి ఎవరికీ భయం ఉండదు. ఎందుకంటే చుట్టూ దుకాణాలు ఉంటాయి ఇక్కడ భారతీయ చైనీస్ వంటకాలు బాగా ఫేమస్.


End of Article

You may also like