కుటుంబాన్ని పోషించడానకి అరటిపండ్లమ్ముకుంటున్న టీచర్…ఫోన్ పాడైనందుకు ఇలా చేయడం న్యాయమా?

కుటుంబాన్ని పోషించడానకి అరటిపండ్లమ్ముకుంటున్న టీచర్…ఫోన్ పాడైనందుకు ఇలా చేయడం న్యాయమా?

by Megha Varna

Ads

కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఊహించని సంక్షోభం ఏర్పడింది..మనదేశంలో అయితే కరోనా చావుల కంటే ఆకలి చావులు ఎక్కువగా నమోదవుతాయా అన్నట్టుగా భయబ్రాంతులకు గురయ్యేలా చేసింది..ఇప్పటికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారందరూ పూట గడవడం కోసం నానాపాట్లు పడుతున్నారు.. విద్యారంగం కూడా అతలాకుతలం అయింది..ప్రభుత్వ టీచర్ల పరిస్థితి కాస్త మెరుగు కానీ ప్రైవేట్ టీచర్ల పరిస్థితి మరీ ఘోరం..

Video Advertisement

 

ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ టీచర్లు కూలి పనులు చేస్కుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఉదంతాలు లెక్కలేనన్ని..తాజాగా నెల్లూరులో ఒక టీచర్ కుటుంబపోషణ కోసం అరటిపండ్లు అమ్ముతూ కనపడ్డారు..నెల్లూరు జిల్లా వేదాయపాళెం నివాసి వెంకటసుబ్బయ్య ఎంఎ పొలిటికల్ సైన్స్, ఎంఏ తెలుగు, బిఇడి చదివారు.. 2008 నుండి ఒక కార్పొరేట్ స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు.

లాక్ డౌన్ వేటు మొదట పడింది పాఠశాలల పైనే..దాంతో ఇంట్లోనే ఉంటున్న టీచర్ల చేత విద్యార్దులకు ఆన్లైన్ పాఠాలు బోదించాయి ప్రైవేట్ యాజమాన్యాలు.. వెంకట సుబ్బయ్య కూడా కొద్ది రోజులపాటు ఆన్లైన్ పాఠాలు చెప్పారు..ఇంతలో తన స్మార్ట్ ఫోన్ పాడైంది..మరో వైపు ప్రతి ఏడాది టీచర్లకు  కొత్త విద్యార్దులను చేర్పించాలనే టార్గెట్లుంటాయి.. వెంకటసుబ్బయ్య టార్గెట్ చేరు కోలేకపోయారు.. ఫోన్ పాడై క్లాసులు చెప్పలేకపోయారు, టార్గెట్ చేరుకోలేకపోవడంతో యాజమాన్యం ముఖం చాటేసింది.

representative image

జీతం లేక కుటుంబ పోషణ కష్టమైంది, మరోవైపు పోయినేడాది వెంకట సుబ్బయ్య చిన్న కుమారిడి శస్త్ర చికిత్స జరగడంతో అప్పుల పాలయ్యారు. మూడు లక్షల పైన అప్పు చెల్లించాల్సి ఉంది. చేసేదేం లేక కుటుంబాన్ని పోషించడం కోసం స్నేహితుల దగ్గర అప్పు చేసి ఒక అరటిపండ్ల బండి తీసుకుని , పండ్లు అమ్ముతున్నారు. బతుకునేర్పే గురువు తన బతుకు కోసం అష్టకష్టాలు పడడం చూసి అందరూ  బాధపడుతున్నారు..సోషల్ మీడియాలో వైరలవుతోన్న వెంకటసుబ్బయ్య ఫోటో, కథ నెటిజన్ల చేత కంటతడి పెట్టిస్తున్నది..


End of Article

You may also like