Home Filmy Adda “జనవరి 2” మీద కన్నేసిన RRR, రాధే శ్యామ్.! ఎందుకంటే..?

“జనవరి 2” మీద కన్నేసిన RRR, రాధే శ్యామ్.! ఎందుకంటే..?

by Mohana Priya

ఈ సంవత్సరం మొదటిలో రెండు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో మొదటిది ఆర్ఆర్ఆర్ అవ్వగా, రెండోది రాధే శ్యామ్. ఈ రెండు సినిమాలు కూడా దాదాపు సంవత్సరం నుండి వాయిదా పడుతున్నాయి.

ఇప్పుడు ఎట్టకేలకు విడుదలకి సిద్ధమయ్యాయి. వారం గ్యాప్‌లో రెండు సినిమాలు విడుదల అవుతాయి. కానీ మళ్ళీ కరోనా కేసులు పెరగడం మొదలయ్యాయి.  నార్త్ ఇండియాలో పరిస్థితి, సినిమా విడుదలకి సహకరించేలా లేదు. కానీ రెండు సినిమాల బృందాలు మాత్రం ముందు చెప్పిన తేదీకే విడుదల చేయడనికి నిర్ణయించుకున్నారు.

rrr trailer analysis and hidden details

పరిస్థితి ఇంకా సీరియస్ అవ్వకముందే కర్ఫ్యూ విధించాలి అని అక్కడి ప్రభుత్వం భావించినట్లు సమాచారం. న్యూ ఇయర్ కి జనాలు ఎక్కువగా గుమిగూడతారు. అలా అయితే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. దాంతో జనవరి 2వ తేదీన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగా ఈ రెండు సినిమా బృందాల కన్ను జనవరి 2వ తేదీన పడింది. థియేటర్స్, షాపింగ్ మాల్స్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి.

radheshyam glimpse

ఒకవేళ అలాగే జరిగితే థియేటర్లలో సీటింగ్ 50శాతానికి తగ్గుతుంది. అప్పుడు ఈ రెండు సినిమాలు విడుదల అవ్వడం కష్టం. నార్త్ లో ఈ సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఒకవేళ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ సినిమాలు అదే సమయంలో విడుదల అయితే కష్టం. అందుకే రెండు సినిమాల దర్శక నిర్మాతలు కూడా జనవరి 2వ తేదీ రోజు తీసుకునే ఆ కీలక నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

You may also like