ఆ రోజుల్లో చిరంజీవి అలా చేసేవారంట.. చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పుకొచ్చిన హనుమాన్ హీరో! 

ఆ రోజుల్లో చిరంజీవి అలా చేసేవారంట.. చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పుకొచ్చిన హనుమాన్ హీరో! 

by Mounika Singaluri

Ads

ఇప్పుడు అందరూ హనుమాన్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి బరిలో పెద్దపెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటి మధ్యలో హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళ ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. అయితే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది అంటున్నారు మూవీ టీం.

Video Advertisement

ట్రైలర్స్ లో గాని టీజర్ లో గాని పెద్ద సినిమాలకి ఏ మాత్రం తీసిపోకుండా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది హనుమాన్ సినిమా. అయితే ఈ మధ్యనే జరిగిన హనుమాన్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు చిరంజీవి. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో తేజ మాట్లాడుతూ చిరంజీవితో తనకి ఉన్న చిన్ననాటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. చూడాలని ఉంది సినిమాతో సినీ కెరియర్ స్టార్ట్ చేసిన తేజ తన మొదటి సినిమా చిరంజీవితోనే కావటం విశేషం.

ఆ తరువాత ఠాగూర్, ఇంద్ర వంటి సినిమాలలో చిరంజీవితో నటించి అతనికి మరింత దగ్గర అయ్యాడు తేజ. ఒక్క చిరంజీవి సినిమాలలోనే కాకుండా మెగా కాంపౌండ్ లో ఉన్న అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి వారి సినిమాలలో కూడా తేజ నటించడం విశేషం. అందుకే తేజ కి చిరంజీవికి మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ అనుబంధంతోనే చిరంజీవి తేజ ప్రతి పుట్టినరోజు ను గుర్తుపెట్టుకుని మరీ తేజకి ఫోన్ చేసి విషెస్ చెప్పి కేక్ కట్ చేయడానికి తన ఇంటికి ఆహ్వానించేవారుట.

చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్టు 22 అయితే తేజ పుట్టినరోజు ఆగస్టు 23 కావటం వలన చిరంజీవికి ఆ డేట్ బాగా గుర్తుండేది. ఆల్మోస్ట్ తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినంతకాలం చిరంజీవి గారు తేజ బర్త్ డే ని ఈ విధంగానే సెలబ్రేట్ చేసే వారిని ఎంతో ఆనందంగా పాత జ్ఞాపకాలని నెమరు వేసుకున్నాడు తేజ. ఇప్పుడు ఈ స్పీచ్ తెగ వైరల్ అవుతుంది అంతేకాదు హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జ ఇచ్చిన స్పీచ్ కూడా తెగ వైరల్ అవుతుంది.

https://www.instagram.com/p/C1wRuOTsOqQ/


End of Article

You may also like