జగన్ ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రశంసల వర్షం..! ఏం అన్నారంటే..?

జగన్ ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రశంసల వర్షం..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

తెలంగాణలో ఎలెక్షన్స్ హడావుడి ప్రారంభం అయ్యింది. రాజకీయ పార్టీలన్ని ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.  బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ మీటింగ్ తో ఎలెక్షన్ల శంఖారావం పూరించారు. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు.

Video Advertisement

సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలోని హామీలను ప్రకటిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గవర్నమెంట్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ గవర్నమెంట్ అమలు చేస్తున్నఒక పథకం గురించి చెబుతూ అభినందించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎలెక్షన్స్ కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలోని హామీలలో ఒకటైన ఆసరా పెన్షన్‌ను కూడా పెంచుతున్నట్టు ప్రకటించారు. రూ. 2016 గా ఉన్న పెన్షన్‌ను ఐదు వేలకు పెంచుతామని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3000కు పెంచుతామని, ఆ తరువాత ఏడాది ఐదు వందల చొప్పున పెంచుకుంటూ, చివరి ఏడాది వచ్చే వరకు ఐదు వేలు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ మాట్లాడుతూ, ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పింఛన్ పథకాన్ని సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. తాము ప్రకటించినపుడే, 2 వేల పింఛన్‌ను ప్రకటించి, సంవత్సరానికి 500 చొప్పున పింఛన్‌ను పెంచుతూ, ప్రస్తుతం మూడు వేలు ఇస్తున్నారని వెల్లడించారు.
ఈ పథకాన్ని విజయవంతంగా ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని, తాము కూడా అదే పద్ధతిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.తమ పథకాల అమలులో దేశానికి తెలంగాణే ఆదర్శంగా నిలిచిందని ప్రతిసారి చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్, తానే స్వయంగా, ఏపీ గవర్నమెంట్ ని ప్రశంసించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ ని ఫాలో కానున్నట్టుగా కూడా ప్రకటించారని తెలుస్తోంది.

Also Read: ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబును అప్పటివరకు అరెస్టు చేయొద్దు.. సుప్రీంకోర్టు..!


End of Article

You may also like