CM REVANTH REDDY FIRST SIGN: మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి…సీఎం గా తొలి సంతకం ఆ ఫైల్ పైనే.!

CM REVANTH REDDY FIRST SIGN: మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి…సీఎం గా తొలి సంతకం ఆ ఫైల్ పైనే.!

by Mounika Singaluri

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. ఈ పేరు ఏపీ రాజకీయాలలో కూడా ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందారు రేవంత్ రెడ్డి. దీంతో అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో అంబరాలు సంబరాలు అంటుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో చాలా సేపు ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామ్యులు.

Video Advertisement

మేము పాలకులం కాదు. ప్రజా సేవకులం. ప్రజలు ప్రగతి భవన్ కు రావచ్చుఅని తెలిపారు రేవంత్ రెడ్డి. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాము. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావచ్చు. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రసంగం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారెంటీల అభయ హస్తం అమలు ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగాన్ని కల్పిస్తూ సంతకం చేశారు.

రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం,తొలి సంతకం అభయహస్తం ఫైలుపై చేయడంతో పాటు రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. కాగా ఉద్యోగం కల్పించాలని రజిని అనే దివ్యాంగురాలు కొంతకాలం క్రితం గాంధీభవన్ లో కలిసి రేవంత్ ను కోరగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తానని హామీనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే రజిని అనే దివ్యంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ ఫైలుపై సంతకం చేశారు.


You may also like

Leave a Comment