Ads
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఆ ఫోటోలలో రేవంత్ రెడ్డి ఓ పోస్టర్ ను స్వయంగా తన కారుకు అతికిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
Video Advertisement
అయితే సీఎం రేవంత్ అతికించిన పోస్టర్, రాహుల్ గాంధీ ప్రారంభించబోయే భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించినది. ఆ యాత్రకు సంఘీభావం తెలుపుతూ, ఇలా పోస్టర్ అతికించారని తెలుస్తోంది. ఆ పోస్టర్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం..
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా జనవరి 14 నుండి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించబోతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుండి మొదలయ్యే ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,500 కిలోమీటర్లు సాగి ముంబైలో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బస్సు మరియు కాలినడకన, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ క్రమంలో వంద లోక్‌సభ స్థానాలను చూడుతూ ఈ యాత్ర ముంబైలో ముగుస్తుంది. ఇండియా కూటమి నాయకులను కూడా ఈ యాత్రకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభావంగా యాత్రకు సంబంధించిన పోస్టర్ ను స్వయంగా తానే తన వాహనానికి అతికించారు. ఆ పోస్టర్ లో రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, భారత్ జోడో న్యాయ్ యాత్ర అని ఉంది. ఈ పోటోలను ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
“ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు. గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు కర్తవ్య బోధ చేస్తున్నాను.”
Also Read: ఏపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్… చేరిన వారానికే వైసీపీ నుంచి అంబటి రాయుడు తప్పుకోడానికి కారణం ఇదేనా.?
End of Article