కరెంటు బిల్ ఎక్కువ రావడానికి కారణం ఇదే..! TSSPDCL క్లారిటీ.!

కరెంటు బిల్ ఎక్కువ రావడానికి కారణం ఇదే..! TSSPDCL క్లారిటీ.!

by Megha Varna

Ads

ఇటీవల కాలంలో కరెంటు బిల్లుల మొత్తం ఎక్కువగా వస్తున్నాయి అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు .కాగా ఈ విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది.అయితే దీనిపై టీఎస్ ఎస్పీడీసీఎల్ రఘుమారెడ్డి క్లారిటీ ఇచ్చారు.దీనికి సంభందించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

representative image

కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వలనే కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చాయని, అయినా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యుత్ వాడకం బాగా పెరిగిందని రఘుమారెడ్డి అన్నారు.కరెంటు బిల్లులు ఎక్కువ మొత్తం వచ్చిందని మాకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో పిర్యాదు చేసారు.కావున కరెంటు బిల్ చెల్లింపు సమయంలో ఈ నెలలో కొంతమొత్తం, అలాగే వచ్చే నెలలో మిగిలిన మొత్తం చెల్లించేలాగా వినియోగదారులకు అవకాశం కల్పించినట్లు రఘుమారెడ్డి తెలిపారు.

representative image

ఇప్పటిదాకా దాదాపు 58 శాతం మంది మాత్రమే కరెంటు బిల్ చెల్లించారు అని రఘుమారెడ్డి తెలిపారు.అయితే ఈ నేపథ్యంలో మేము బిల్లులు ఏమి పెంచలేదని, ఎంత విద్యుత్ అయితే వాడారో అంతే బిల్లు ఇచ్చామని రఘుమారెడ్డి క్లారిటీ ఇచ్చారు.మాములుగా వేసవికాలంలో విద్యుత్ వినియోగం పెరగడం వలన స్లాబ్ మారి విద్యుత్ బిల్ ఎక్కువగా వస్తుందని స్పష్టం చేసారు రఘుమారెడ్డి.


End of Article

You may also like