తెలంగాణాలో కరోనా కేసుల్లో ఎక్కువ మంది వారే అంట…?

తెలంగాణాలో కరోనా కేసుల్లో ఎక్కువ మంది వారే అంట…?

by Mohana Priya

ఇప్పటివరకు కరోనా వైరస్ వచ్చే ముందు కొన్ని సూచనలు ఉంటాయి అని అనుకున్నాం. కానీ ఇటీవల తెలంగాణలో నమోదైన కేసుల ప్రకారం ఎక్కువమంది ముందు ఎటువంటి సూచనలు లేకుండానే కరోనా వైరస్ బారిన పడుతున్నారట. వివరాల్లోకి వెళితే. 10 టీవీ కథనం ప్రకారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటివరకు వచ్చిన కరోనా కేసులను పరిశీలించి చూసింది.

Video Advertisement

అందులో మొత్తం కేసులో 69 శాతం మంది కరోనా లక్షణాలు లేకుండానే వైరస్ బారిన పడ్డారట. 31 శాతం మందికి కరోనా లక్షణాలు కనిపించాయట. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,24,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 86,225 మందికి ముందు ఎటువంటి లక్షణాలు కనిపించలేదట. 38,738 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయట.

కానీ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను పరీక్షల ద్వారా గుర్తించి వెంటనే వైద్యం అందించడం వల్ల ఎక్కువమంది వేగంగా కోలుకుంటున్నారట. వీళ్ళని తమ ఇళ్లలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అందులో 24,216 మంది తమ ఇళ్లలో, లేదా వివిధ సంస్థల ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారట.

కానీ ఇలా లక్షణాలు కనిపించకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నుండి తమకు తెలియకుండానే ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది అని, దీంతో వైరస్ సోకిన వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది అని, అలా తెలియకుండా వైరస్ వ్యాపించి ఎన్నో కుటుంబాల్లో 15 నుండి 20 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.


You may also like