Ads
తెలంగాణలో లాక్ డౌన్ గడువును సీఎం కేసీఆర్ మే 7వ తేదీ వరకూ పొడిగించిన నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి మూడు కమిషనరేట్ ల కమిషనర్ లతో పాటు ఐజీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొడిగించిన లాక్ డౌన్ లో కఠినంగా అమలు చేయాల్సిన అంశాలపై చర్చించినట్లు డీజీపీ మీడియా ముఖంగా తెలిపారు . సోమవారం సాయంత్రం మీడియాతో సమావేశమైన డీజీపీ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు .
Video Advertisement
ఈ నెల 21వ తేదీ నుంచి వాటిని రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారుల నియంత్రణపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అత్యవసర సరుకుల సరఫరా కోసం కొందరికి పాసులు ఇచ్చాం. అవసరం లేకుండా ఆ వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారు. పాసులు ఉన్న వ్యక్తులు ఎక్కడ తిరగాలో ప్రదేశాలను గుర్తించామన్నారు.లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించిన వాహనదారుల పాసులను తక్షణమే రద్దు చేస్తామని మహేందర్ రెడ్డి చెప్పారు ..
కొత్త పాసులు జారీ చేసేవరకు పాత పాసులు కొనసాగిస్తామన్నారు.నిత్యవసరాల కోసం 3 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లకూడదని మహేంద్ర రెడ్డి తెలిపారు .వాహనదారులు రెసిడెన్స్ ప్రూఫ్ తో బయటకు రావాలన్నారు .కాగా ప్రభుత్త్వ కార్యాలయాల్లో పని చేసే సిబ్బందికి మాత్రం పాసులు ఇస్తామన్నారు .
లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 1 .21 లక్షల వాహనాలు సీజ్ చేశామని తెలిపారు .లాక్ డౌన్ పూర్తి కాగానే ఆయా వాహనాలకు ఫైన్ కట్టి కోర్ట్ ద్వారానే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు .చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటె దగ్గరలోని ఆసుపత్రిని సంప్రదించండి కానీ తీవ్ర ఆరోగ్య సమస్య ఉంటె మాత్రం రిఫరెన్స్ పాత్రలతో పాటు రెసిడెన్స్ ప్రూఫ్ ను వెంటపెట్టుకుని దూరం ఉన్న ఆసుపత్రిలోనైనా సంప్రదించవచ్చు అని తెలిపారు .రేషన్ దుకాణాలు ,బ్యాంకుల దగ్గర భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు …అందరూ సామాజిక దూరం పాటించి కరోనా ను తరిమికొట్టాలని అయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
End of Article