తెలంగాణ మంత్రితో తెలుగు బ్యూటీ బైక్ రైడ్..! అసలు కథ ఏంటో చూడండి!

తెలంగాణ మంత్రితో తెలుగు బ్యూటీ బైక్ రైడ్..! అసలు కథ ఏంటో చూడండి!

by Megha Varna

అంతకు ముందు ఆ తరువాత చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా హైద్రాబాది అమ్మాయి ఈషా రెబ్బ. ఆమే ఎం.బి.ఏ చేశారు. ఫేస్‌బుక్‌లో అమె చిత్రాలు చుసిన ఇంద్రగంటి మోహన కృష్ణ అమెను అంతకు ముందు… ఆ తరువాత… చిత్రంలో నటించటానికి ఎంపిక చేసారు. ఆమె బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు,అ! మొదలైన చిత్రాలలో నటించింది.

Video Advertisement

ఇది ఇలా ఉండగా తెలంగాణ రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్, తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా బైక్ రైడ్ ఫొటోలు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి. వాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు భద్రత వారోత్సవాలు సోమవారం 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహించారు. అందులో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహనా కల్పించాలి అని మంత్రి పువ్వాడ అజయ్ హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవింగ్ చేశారు. అదే బైక్ లో వెనక సీట్ లో ఈషా రెబ్బ కూర్చోవడం విశేషం.

ఈ కార్యక్రమంలో భుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ సందీప్ కుమార్ సుల్తానీయ, హైద్రాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నటి ఈషా రెబ్బ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈషా రెబ్బా బాలీవుడ్‌లో హర్షవర్ధన్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటించనుంది.మరి ఈ బ్యూటీకి ఇప్పటికైనా తెలుగులో ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.


You may also like

Leave a Comment