Ads
కరోనా మహమ్మారి కారణంగా పదవ తరగతి పరీక్షలు మధ్యలో ఆగిపోయిన సంగతి అందరికి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధిని వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.గతంలో మాదిరిగా కాకుండా ఒక పరీక్ష హాలులో కేవలం 12 మంది విద్యార్ధులు మాత్రమే పరీక్ష రాసేలా చర్యలు తీసుకోబోతున్నారు. విద్యార్థులకు మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. విద్యార్ధులకు మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండటంతో పాటుగా ప్రతీ బెంచ్‌కు ఒక విద్యార్ధి మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Video Advertisement
representative image
తెలంగాణ లో పదవ తరగతి పరీక్షలు జూన్ 8 నుండి జులై 5వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబందించిన షెడ్యూల్ కూడా విడుదల చేసారు. హై కోర్ట్ ఆదేశాలమేరకు కొన్ని నిభందనలు విధించారు. ప్రతి పరీక్షకు రెండు రోజులు గ్యాప్ ఉండేలా అధికారులు పరీక్షల తేదీలను ఖరారు చేశారు.అంతేకాదు అదనంగా 2500 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
representative image
పరీక్ష తేదీలు ఇవే:
ఇంగ్లీష్ 1 -> జూన్ 8
ఇంగ్లీష్ 2 -> జూన్ 11
మ్యాథ్స్ 1 -> జూన్ 14
మ్యాథ్స్ 2 -> జూన్ 17
సైన్స్1 -> జూన్ 20
సైన్స్ 2 -> జూన్ 23
సోషల్ 1 -> జూన్ 26
సోషల్ 2 -> జూన్ 29
పరీక్ష సమయం: ఉదయం 9.30గంటల నుండి 12.00గంటల వరకు
పరీక్ష కేంద్రాల దగ్గర విద్యార్థులు తల్లితండ్రులు ఎక్కువమంది జమచేరకుండా తగిన చర్యలు తీసుకుంటారంట. పరీక్షకు హాజరైన విద్యార్థులలో ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు ఉంటె వారిని వేరొక గదిలో పరీక్ష రాయిస్తారంట. ప్రతి పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్ చేయాలని సూచించారు విద్యాశాఖ మంత్రి. ప్రతి విద్యార్థిని థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారని తెలిపారు.
End of Article