Ads
ఇండియాలో చదువుకుంటున్న ఎంతోమంది యువతీ యువకులకు అమెరికాకు వెళ్లి మాస్టర్స్ చేయడం అనేది ఒక అందమైన డ్రీమ్. చాలామంది మాస్టర్స్ కోసం పుట్టిన ఊరును కన్న తల్లిదండ్రులను అన్నిటిని వదులుకొని ఎన్నో ఇబ్బందులను సైతం ఎదుర్కొంటారు.
Video Advertisement
అయితే తెలంగాణ నుంచి అమెరికాలో మాస్టర్స్ చేయాలి అని ఎంతో ఆశతో వెళ్లిన ఒక యువతి ప్రస్తుతం అక్కడ నిస్సహాయ స్థితిలో చికాగో రోడ్లపై అతి దయనీయమైన పరిస్థితిలో ఉంది.
డిప్రెషన్ , ఒంటరితనంతో బాధపడుతూ ఆకలికి అలమటిస్తూ రోడ్లపై తిరుగుతున్న తమ కూతురిని తమ వద్దకు చేర్చమని ఆ తల్లి విదేశాంగ మంత్రిని వేడుకుంటూ లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది. అయితే అసలు ఆ అమ్మాయి ఆ పరిస్థితికి ఎలా వచ్చింది అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.
రోడ్డు మీద తిరుగుతున్న అమ్మాయిని చూసి గుర్తుపట్టిన ఇద్దరు హైదరాబాద్ యువకులు ఆమె తల్లికి విషయాన్ని తెలియజేశారు. అది తెలుసుకున్న ఆమె తల్లి తన కుమార్తెను ఎలాగైనా ఇండియాకు తీసుకువచ్చే దానికి సహాయం చేయమని విదేశాంగ మంత్రి అయిన ఎస్ జైశంకర్ కు లెటర్ రాశారు. 2021 వ సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం హైదరాబాద్ లోని మౌలాలి కి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ డెట్రాయిట్ వెళ్లింది.
అక్కడ ట్రైన్ ( TRINE) యూనివర్సిటీలో ఆమె చేరిన తరువాత కూడా ఫ్యామిలీతో బాగానే టచ్ లో ఉండేది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ గత రెండు నెలలుగా ఆమె తన ఫ్యామిలీతో అస్సలు టచ్లో లేకుండా పోయింది. ఆమెకు ఏమైపోయింది అని ఆమె ఫ్యామిలీ ఎంతో కంగారు పడుతున్నారు. అయితే ఇన్ని రోజులకు ఆమె సామాన్లు దొంగలించబడ్డాయని, డిప్రెషన్ తో ఆకలితో అలమటిస్తూ ప్రస్తుత ఆమె చికాగోలో రోడ్లపై కనిపించిందని తెలుసుకున్న ఆమె తల్లి ఆవేదనతో అలమటిస్తోంది.
ALSO READ : ముగ్గురు ఆడపిల్లలు… బాధ్యతల భారం… కానీ..! ఈ మహిళ గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
End of Article