Bigboss 5 Telugu: బిగ్ బాస్ షో పై నోరు పారేసుకున్నాడు..ఇప్పుడు దారుణంగా ట్రోల్ అవుతున్నాడు..!

Bigboss 5 Telugu: బిగ్ బాస్ షో పై నోరు పారేసుకున్నాడు..ఇప్పుడు దారుణంగా ట్రోల్ అవుతున్నాడు..!

by Mohana Priya

Ads

ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు-5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో లోబో ఒకరు.6 lobo

Video Advertisement

లోబో యాంకరింగ్ తో పాటు సినిమాల్లో కూడా నటించారు. అయితే, లోబో బిగ్ బాస్ ప్రోగ్రాం గురించి అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో బిగ్ బాస్ షో చూస్తారా అని అడిగితే అందుకు లోబో బిగ్ బాస్ కి ఒక దణ్ణం  అని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు. దాంతో సోషల్ మీడియాలో “అప్పుడు బిగ్ బాస్ అంటే ఇష్టం లేదు అన్నారు. ఇప్పుడేమో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు” అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంక బిగ్ బాస్ విషయానికి వస్తే, నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈరోజు కొంత మంది కంటెస్టెంట్లు వారికి సంబంధించిన వస్తువులు అన్నీ ఇచ్చేయాల్సి ఉంటుంది అనే విషయం మనం ప్రోమో చూసి అర్థం చేసుకోవచ్చు.

 

watch video:


End of Article

You may also like