Ads
ఒక మనిషి ఎంటర్టైన్మెంట్ లో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది. కేవలం ఎంటర్టైన్మెంట్ గురించి మాత్రమే కాకుండా సోషల్ మీడియాని ఎన్నో మంచి పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే, సోషల్ మీడియా అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది సినిమాలు. సినిమాల గురించి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో అప్డేట్ అవుతుంది.
Video Advertisement
కేవలం కొత్త సినిమాల గురించి మాత్రమే కాకుండా, పాత సినిమాల గురించి కూడా ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుస్తాయి. అలాగే పాత సినిమాల్లో, లేదా సూపర్ హిట్ అయిన సినిమాల్లో కొన్ని ఫేమస్ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, పాటలు కూడా ఇప్పుడు టెంప్లేట్స్ లాగా మనకి తరచుగా కనిపిస్తూనే ఉంటాయి.
అలా మన తెలుగు సినిమాల్లో ఫేమస్ అయిన డైలాగ్స్, పాటలు, ఎక్స్ప్రెషన్స్ చాలానే ఉన్నాయి. మనం వాటిని ప్రతి రోజు ఏదో ఒక మీమ్ లో చూస్తూనే ఉంటాం. అయితే ఒకవేళ గూగుల్ ట్రాన్స్లేట్ ఉపయోగించి కొన్ని సినిమాల్లోని పదాలను వేరే భాషలోకి అనువదించినా కూడా వాటి అర్థం ఒక ట్రెండింగ్ టెంప్లేట్ లాగానే వస్తుంది.
ఒకవేళ మన తెలుగులో ఉన్న కొన్ని టెంప్లేట్స్, సినిమా డైలాగ్స్, పాటలని గూగుల్ ట్రాన్స్లేట్ ఉపయోగించి ఇంగ్లీష్ భాషలోకి అనువదిస్తే వాటికి వచ్చే అర్థం కూడా ఇలాగే ఒక డైలాగ్, లేదా పాట రూపంలోనే ఉంటే ఎలా ఉంటుందో అని ఒక వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోని ఒరేయ్ ఆజాము అనే ఒక మీమ్ పేజ్ రూపొందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
https://www.instagram.com/p/CPDtE_9png_/?utm_source=ig_web_copy_link
End of Article