ఈ 7 మంది తెలుగు డైరెక్టర్ల కూతుర్లు ఏం చేస్తున్నారో తెలుస్తే…తండ్రికి తగ్గ కూతుర్లు అనుకుంటారు.!

ఈ 7 మంది తెలుగు డైరెక్టర్ల కూతుర్లు ఏం చేస్తున్నారో తెలుస్తే…తండ్రికి తగ్గ కూతుర్లు అనుకుంటారు.!

by Megha Varna

Ads

ఒక సినిమా జయాపజయాలు పూర్తిగా దర్శకుడి మీదనే ఆధారపడి ఉంటుంది . అందుకే డైరెక్టర్ ను కెప్టెన్ అఫ్ ది షిప్ అని అంటారు .తెర వెనక ఒక దర్శకుడు తన అభిరుచుకి తగ్గట్టు తాను తీసుకొనే నిర్ణయాలే సినిమా విజయాన్ని నిర్ణయిస్తాయి .అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాల మంది ప్రతిభవంతులైన దర్శకులు ఉన్నారు .వారి గురించి ప్రేక్షకులకి తెలిసినప్పటికీ వారి కుటుంబ విషయాలు చాల అరుదుగా బయటకి వస్తుంటాయి .ఇదంతా గతం ఇప్పుడు పరిస్థితి మారిపోయింది .

Video Advertisement

సోషల్ మీడియా వలన ఇప్పుడు ఎవరు ఏంచేసినా వెంటనే తెలిసిపోతుంది .అలాగే మన టాలీవుడ్ దర్శకుల కుమార్తెల గురించి కూడా అనేక ఆశక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి .వీరు ప్రపంచానికి దర్శకుల కుమార్తెలుగా బయటకు పరిచయమైనప్పటికీ వారిలో స్వతహాగా వున్నా టాలెంట్ వలన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తండ్రికి తగ్గ కూతురులు అని అనిపించుకుంటున్నారు ..మరి ఆలా తండ్రులకి మంచి పేరు తీసుకు వస్తున్నా కూతుర్లు ఎవరో వారి విశేషాలేంటో ఇప్పుడు చూద్దామా ..

#1. పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర

మొదటగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ .పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో తనకంటూ ఒక మార్క్ ను సృష్టించుకున్న ఈ దర్శకుడు మహేష్ బాబు తో పోకిరి , ప్రభాస్ తో బుజ్జిగాడూ ,రవితేజతో ఇడియట్ అంటూ తాను ఏ హీరోతో సినిమా తీసిన అంతక ముందు హీరో నటన పూరి సినిమా తర్వాత హీరో యాక్టింగ్ అనేంతగా మార్పు తీసుకు రాగలిగిన స్కిల్ ఫుల్ డైరెక్టర్ పూరి . తాజాగా హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి బారి హిట్ ను సొంతం చేసుకున్నాడు . మరి ఈ దర్శకుడి కూతురు ఇంకెంత ప్రతిభావంతురాలో చూద్దామా .పూరి కూతురి పేరు పవిత్ర .

కొడుకు ని హీరో గా పరిచయం చేసిన పూరి పవిత్రను కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసే పనిలో పడ్డాడు .ఇప్పటికే బుజ్జిగాడూ ఛితంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యారు పవిత్ర .పవిత్రకు నటన కంటే కూడా దర్శకత్వం చెయ్యడం అంటేనే ఇష్టం అంట .అంతే కాదు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా వుంటూ తన గురించిన తాజా సమాచారాన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది .పవిత్ర త్వరలోనే దర్శకురాలుగా పరిచయం అయ్యే అవకాశం వుంది

#2. సుకుమార్ కూతురు సుకృతి వేణి

ఇక ఇలా తండ్రి ఇమేజ్ ని మరింత పెంచబోతున్న మరో దర్శకుడి కూతురు సుకృతి వేణి .దర్శకుడు సుకుమార్ గారాల కూతురు అయిన సుకృతి వేణి వయస్సులో చిన్నదే గాని టాలెంట్ లో కాదని అనిపించుకుంటున్నారు .తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని ఇప్పటికే urban jam with సుకృతి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి తెలియచేస్తూన్నారు .ఈ నేపథ్యంలో సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పాటని విడుదల చేసి తన తండ్రికి అంకితం ఇచ్చింది .సుకుమారులో ఉన్న టాలెంట్ కి తన కూతురు ఏమి తీసిపోదు అని అంటున్నారంతా .

#3. తేజ కూతురు ఐలా

దర్శకుడు తేజ తన కొడుకు ని హీరో గా పరిచయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే . కానీ తేజ కుమార్తె మనకు ఎక్కడ కనిపించదు . తేజ కుమార్తె ఐలా తేజ ప్రస్తుతం అమెరికాలో haas school of business ఆఫ్ berkeley లో మాస్టర్స్ చదువుతుంది .చదువుకుంటూనే తాను ఒక మంచి స్పీకర్ గా అమెరికా లో బెర్కిలీ ఫోరమ్ తరపున పలు కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తుంది .యువత మేల్కోవాలని వారి ఐడియాస్ ని వ్యాపార దిశలో అభివృద్ధి చేసుకోవలసిందిగా చెప్తున్నారు ఐలా తేజ .రానున్న కాలంలో మంచి బిజినెస్ వుమన్ గానే కాకుండా మంచి స్పీకర్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు .

#4. గుణశేఖర్ కూతురు నీలిమ

దర్శకుడు గుణశేఖర్ కు ఇద్డు గారాల కుమార్తెలు .ఇద్దరు కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు .అనుష్క నటించిన రుద్రమ దేవి చిత్రానికి గుణశేఖర్ పెద్ద కూతురు నీలిమ నిర్మాతగా వ్యవహరించింది .చిన్నకూతురుకి కూడా సినీ పరిశ్రమ అంటే ఇష్టమై త్వరలోనే తాను ఏదొక విభాగంలో పనిచేస్తారని తెలిపారు గుణశేఖర్ .

#5. వంశి పైడిపల్లి కూతురు ఆద్య

మహేష్ బాబు గారాల కూతురు సితార తో కలిసి వంశి పైడిపల్లి కూతురు ఆద్య యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది . తనలో వున్నా టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా బహిర్ఙ్గతం చేస్తుంది .

#6. మారుతి కూతురు హియా

దర్శకుడు మారుతి సైతం తన ముద్దుల కూతురుని తన దర్శకత్వం వహించిన ప్రతి రోజు పండగే ద్వారా పరిచయం చేసాడు . అత్యంత త్వరలోనే పూరి స్థాయి నటీమణిగా మారుతుంది అనడంలో ఎం సందేహం లేదు అంటున్నారు ప్రేక్షకులు .

#7. రాజమౌళి కూతురు మయూఖ

రాజమౌళి కూతురు మయూఖ సైతం తన కుటుంబం లాగే తాను కూడా ఇండస్ట్రీ లోనే తన కెరీర్ ను ఆరంభిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని సినీ వర్గాలు అనుకుంటున్నాయి .


End of Article

You may also like