Breaking : సమ్మె విరమించిన సినీ కార్మికులు.. రేపటి నుంచి షూటింగ్‌లు షురూ..

Breaking : సమ్మె విరమించిన సినీ కార్మికులు.. రేపటి నుంచి షూటింగ్‌లు షురూ..

by Sunku Sravan

Ads

తమ వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే వేతనాలు పెంచడంపై నిర్మాతల మండలి స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు సినీ కార్మికులు వెల్లడించారు. దీంతో రేపటి నుంచి యథావిధిగా సినిమా షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవ తీసుకొని నిర్మాతల మండలి- కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపించారు.

Video Advertisement

సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై దాదాపు 2 గంటలు చర్చలు జరిపిన అనంతరం చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మండలి వెల్లడించింది. రేపు సమన్వయ కమిటీతో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని నిర్మాతల మండలి పేర్కొంది. దీంతో, సమ్మెను విరమిస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌తో పాటు చుట్టుప్రక్కల దాదాపు 28 సినిమాలు షూటింగ్‌ జరుపుకుంటుండగా.. సినీ కార్మికుల సమ్మెతో ఎక్కడి షూటింగ్‌లు అక్కడే నిలిచిపోయాయి. ఇందులో భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే సమ్మె బాట పట్టిన సినీ కార్మికులను సమ్మె విరమించాలని కోరింది. అయితే మంత్రి తలసాని కలుగజేసుకొని సమస్య మరింత ముదరకముందే పరిష్కారం దిశగా అడుగులు వేశారు.

 

 


End of Article

You may also like