తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం…ఇప్పటి నుంచి ఫేక్ క‌ల‌క్ష‌న్లు గొడవా ఉండదు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం…ఇప్పటి నుంచి ఫేక్ క‌ల‌క్ష‌న్లు గొడవా ఉండదు

by Megha Varna

తెలుగు సినిమా ఇప్పుడు రికార్డు వ‌సూళ్ల వ‌ల‌లో చిక్కుకుంది. మా సినిమా ఇంత సాధించింది.. మాది ఇన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది అంటూ – పోస్ట‌ర్లు వేసుకుంటూ, ఎవ‌రి డ‌బ్బా వాళ్లే కొట్టుకుంటున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లి `వాళ్ల‌ది ఫేక్ క‌ల‌క్ష‌న్లు..మా హీరో గొప్పంటే .. మా హీరో గొప్ప.. మా హీరో ఈ రేంజ్ లో వసూళ్లు సాదించాడంటే .. కాదు మీవి ఫేక్ ఫేసూల్లు ఇదిగో మా హీరో జెన్యూన్ వసూళ్లు అంటూ ఇంకా ఆయా హీరోల ఫాన్స్ మధ్య గొడవలు నడుస్తూనే ఉన్నాయి.ఈ విషయం గురించి అటు కోలీవుడ్, ఇటు బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఆ హీరోలు టాలీవుడ్ పరువు తీస్తున్నారని టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు

Video Advertisement

దీనికి అడ్డుక‌ట్ట వేయాల‌ని నిర్మాత‌లు క‌లిసిక‌ట్టుగా ఓ నిర్ణ‌యం తీసుకున్నారు.నిర్మాత‌ల శ్రేయ‌స్సు కోసం ఏర్పడిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ సినిమాల రిలీజ్‌ల విష‌యంలో నిర్మాత‌ల‌కు త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తుంది. సినిమాల రిలీజ్ విష‌యంలో క్లాష్ రాకుండా కీల‌క పాత్ర పోషించిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్… త‌మ సినిమా వ‌సూళ్ల లెక్క‌లు ఎవ‌రికి వాళ్లు ప్ర‌క‌టించుకోకూడ‌ద‌ని గిల్డ్ ఓ నియ‌మం విధించింది. ఒక‌వేళ సినిమా వ‌సూళ్ల వివ‌రాలు ప్ర‌క‌టించుకోవాల్సివస్తే అందుకు గిల్డ్ అనుమ‌తి తీసుకోవాలి. ఇలా చేస్తే ఫేక్ క‌ల‌క్ష‌న్ల గొడ‌వ త‌గ్గుతందున్న‌ది అభిప్రాయం.. మొత్తానికి ఇది మంచి అడుగే. గిల్డ్ నిస్ప‌క్ష‌పాతంగా ఉంటే త‌ప్ప‌కుండా ఫేక్ వ‌సూళ్ల బెడ‌ద త‌ప్పుతుంది.మొత్తానికి ఇది సినిమా అభిమానులకు మంచి అడుగే. గిల్డ్ ఖచ్చితంగా పనిచేస్తే ఫేక్ వ‌సూళ్ల బెడ‌ద త‌ప్పుతుంది అని సినీ అభిమానులు కోరుకుంటున్నారు


You may also like

Leave a Comment