ఈ 13 మంది టాలీవుడ్ విలన్ల భార్యలు ఎవరో తెలుసా? వారి వివరాలేంటో లుక్ వేయండి.!

ఈ 13 మంది టాలీవుడ్ విలన్ల భార్యలు ఎవరో తెలుసా? వారి వివరాలేంటో లుక్ వేయండి.!

by Mohana Priya

Ads

తెలుగు సినిమాల్లో నటించే విలన్స్ మన అందరికీ తెలుసు కానీ వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఇంకా వాళ్ళ కుటుంబం వివరాలు అయితే చాలా వరకు బయటికి రావు. అలా మన విలన్స్ భార్యలు కూడా ఎక్కువ మందికి తెలియదు. టాలీవుడ్ లో విలన్ పాత్రలో నటించే కొంతమంది నటుల భార్యలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 మురళి శర్మ – అశ్విని కాల్సేకర్

అశ్విని కూడా నటే. తెలుగులో బద్రీనాథ్ సినిమాలో విలన్ గా నటించారు. హిందీలో కూడా ఎన్నో చిత్రాల్లో సీరియల్స్ లో నటించారు.

#2 తరుణ్ అరోరా – అంజలా జవేరి

ఖైదీ నెంబర్ 150 లో విలన్ గా నటించారు తరుణ్ అరోరా. అంజలా జవేరి కూడా చూడాలని ఉంది, రావోయి చందమామ,సమరసింహా రెడ్డి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలతో తెలుగులో ఎంతో పాపులర్ అయ్యారు.

#3 అశుతోష్ రాణా – రేణుకా సహాని

వెంకీ, తడాఖా, పటాస్ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు అశుతోష్ రాణా. ఆయన భార్య రేణుకా సహాని కూడా హిందీలో చాలా సినిమాల్లో నటించారు. హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో మాధురి దీక్షిత్ కి అక్క గా రేణుక పోషించిన పాత్ర ద్వారా ప్రజలు ఆమెను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

#4 ప్రకాష్ రాజ్ – పోనీ ప్రకాష్ రాజ్

1994లో లలితకుమారి ని పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్. 2009 లో వాళ్లు విడిపోయారు. 2010 లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ని పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్.

#5 రఘువరన్ – రోహిణి

తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో అందరికీ దగ్గరయ్యారు రఘువరన్. రోహిణి కూడా అలా మొదలైంది, ఇష్క్, రంగస్థలం, బాహుబలి, అల వైకుంఠపురం లో ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా గీతాంజలి సినిమాలో గిరిజ పాత్రకు, శివ సినిమాలో అమల పాత్రకు,తెలుగు యువ లో మీరాజాస్మిన్ పాత్రకు, అర్జున్ సినిమాలో కీర్తి రెడ్డి పాత్రకుఇంకా ఎన్నో తమిళ్ సినిమాల్లో కూడా హీరోయిన్ల కి డబ్బింగ్  కూడా చెప్పారు.

#6 అజయ్ – శ్వేత

అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్వేత కూడా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు.

#7 కబీర్ దుహాన్ సింగ్ – డాలీ సిధ్ధు

జిల్, స్పీడున్నోడు, సర్దార్ గబ్బర్ సింగ్, డిక్టేటర్ తో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించారు కబీర్ దుహాన్ సింగ్. 2019 లో సింగర్ డాలీ సిధ్ధు తో నిశ్చితార్థం జరిగింది.

#8 సోనూ సూద్ – సోనాలి

సోనూసూద్ కాలేజీలో చదివే రోజుల్లో తెలుగు అమ్మాయి అయిన సోనాలి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

#9 రాహుల్ దేవ్ – ముగ్దా గాడ్సే

2019లో రాహుల్ దేవ్ భార్య రీనా దేవ్ క్యాన్సర్ కారణంగా మరణించారు. ప్రస్తుతం రాహుల్ దేవ్ నటి ముగ్దా గాడ్సే తో ప్రేమ లో ఉన్నట్టు తెలిపారు.

#10 చంకీ పాండే – భావన పాండే

ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన చంకీ పాండే సాహో సినిమా ద్వారా తెలుగు ప్రజలకు కూడా సుపరిచితులయ్యారు. చంకీ పాండే 1998 లో ఫ్యాషన్ డిజైనర్ అయిన భావన పాండే ను పెళ్లి చేసుకున్నారు.

#11 సచిన్ ఖేడేకర్ – జల్పా ఖేడేకర్

13 బి, బ్రదర్స్, జనతాగ్యారేజ్, గౌతమ్ నంద నేను లోకల్, లవర్ అల వైకుంఠపురం లో సినిమాల్లో నటించారు సచిన్ ఖేడేకర్. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించిన సచిన్ ఖేడేకర్ 1993లో జల్పా ఖేడేకర్ ను పెళ్లి చేసుకున్నారు.

#12 ఆశిష్ విద్యార్థి – రాజోషి విద్యార్థి

ఎన్నో సంవత్సరాల నుండి ఆశిష్ విద్యార్థి తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఆశిష్ విద్యార్థి భార్య రాజోషి విద్యార్థి కూడా హిందీ సీరియల్స్ లో నటిస్తారు.

#13 మహేష్ మంజ్రేకర్ – మేధా మంజ్రేకర్

మరాఠి లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించిన మహేష్ మంజ్రేకర్ తెలుగులో ఒక్కడున్నాడు, హోమం, అదుర్స్, అఖిల్, గుంటూర్ టాకీస్, వినయ విధేయ రామ, సాహో సినిమాల్లో నటించారు. మహేష్ మంజ్రేకర్ భార్య మేధా మంజ్రేకర్ కూడా కొన్ని సినిమాలను నిర్మించారు అలాగే ఎంతో ప్రేక్షకాదరణ పొందిన నట్ సామ్రాట్ వంటి మరాఠీ సినిమాల్లో, హిందీ లో దబాంగ్ 3 సినిమాలో నటించారు.


End of Article

You may also like