జూన్ 8 నుండి శ్రీవారి దర్శనం ప్రారంభవుతుందా? భక్తులకు సరికొత్త నియమాలు ఇవేనట!

జూన్ 8 నుండి శ్రీవారి దర్శనం ప్రారంభవుతుందా? భక్తులకు సరికొత్త నియమాలు ఇవేనట!

by Megha Varna

Ads

కరోనా వైరస్ కారణంగా అందరూ సామాజిక దూరం పాటించాలంటూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దేవాలయాలను కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.అయితే మొదటి నుండి లాక్ డౌన్ ను పొడిగిస్తూ వస్తున్నా ప్రభుత్వం జూన్ 8 తర్వాత నుండి మాత్రం నిర్బంధించిన కొన్ని ప్రదేశాలలోని దేవాలయాలను తప్పితే మిగితా అన్ని దేవాలయాలకు దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లుగా ప్రకటించింది.

Video Advertisement

అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే తిరుమలలో ఆలయ దర్శనాలు ప్రారంభించేందుకు  తిరుముల తిరుపతి దేవస్థానం(TTD)సన్నాహాలు చేస్తున్నారంట. ప్రభుత్వం అనుమతిస్తే తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేందుకు సిద్ధమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారంట. అలాగే శ్రీశైలం దేవస్థానం కూడా జూన్ 8 తర్వాత నుండి విచ్చేసే భక్తుల కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.దేవాలయాలకు విచ్చేసే భక్తుల మధ్య సామాజిక దూరం ఉండేలా చూస్తామని అంతేకాకుండా కరోనా వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయశాఖ వెల్లడించింది.

అయితే కరోనా వ్యాప్తి చెందకుండా దేవాలయాల్లో తీసుకునే చర్యల జాబితాను ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ వైద్య ఆరోగ్యశాఖ కు పంపింది.కాగా ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరణ కోసం ఏపీ దేవాదాయశాఖ ఎదురుచూస్తుంది.అయితే ఈ క్రమంలో భక్తులకు కొన్ని నియమాలు విధించారు. అవేంటో చూడండి.

  • జూన్ 8 తర్వాత దేవాలయాల్లో దర్శనాలు మొదలైన తర్వాత గంటకు 250 మందిని మించి దర్శనానికి పంపకూడదు
  • దర్శనానికి వచ్చే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి
  • కొన్ని ప్రత్యేక పూజలకు గతంలో అనుమతించిన భక్తులలో కేవలం 25 శాతం మందిని మాత్రమే అనుమతించాలి.

  • భక్తులు బస చేసే కాటేజిలలో సగం రూమ్ లు కాలిగా ఉంచాలి ,
  • అన్నదానం ప్రసాదం సేవలు ఉండవు
  • ఆలయాల బయట తెరిచే కొబ్బరికాయ ,అరటిపళ్ళ దుకాణం లాంటివి ఒక షాప్ మూసివేసి పక్కనే ఉన్న ఇంకో షాప్ తెరిచి ఉంచాలి
  • ఆలయాల్లో పుణ్యనది స్నానాలు చెయ్యకూడదు.

ఇటువంటి నిబంధనలు అన్ని పాటిస్తే సామాజిక దూరం పాటించడానికి వీలు ఉంటుంది అని తద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని దేవాదాయ శాఖ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

source: tv9telugu


End of Article

You may also like