అక్కడ స్కూల్స్ రీ-ఓపెన్ అయ్యాయి…ఎంతలా మార్పులు చేసారో చూడండి!

అక్కడ స్కూల్స్ రీ-ఓపెన్ అయ్యాయి…ఎంతలా మార్పులు చేసారో చూడండి!

by Mohana Priya

Ads

లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు కూడా మూత పడిపోయాయి. ఎప్పుడో మే లో తెరవాల్సిన పాఠశాలలు పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఇప్పటివరకు తెరవలేకపోతున్నారు. కానీ థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో ఉన్న పతుమ్ తనిలోని సాంఖోక్ పాఠశాల లో తగిన జాగ్రత్తలు తీసుకుని తిరిగి ఓపెన్ చేశారు. ఎంత తిరిగి ప్రారంభించినా కానీ మునుపటి లాగా మాత్రం పాఠశాల ను నడపడం కష్టం.

Video Advertisement

దాంతో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడకుండా పాఠశాల వాళ్లే విద్యార్థులకు, స్టాఫ్ కి బస్సుల సదుపాయం అందిస్తున్నారు. బ్యాంకాక్ కి 31 మైళ్ల దూరంలో ఉన్న ఈ పాఠశాలలో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థి తిరిగి పాఠశాల కి వచ్చే పదిహేను రోజుల ముందు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎలక్షన్ పోలింగ్ బూత్ లో ఉన్నట్టు ప్రతీ డెస్క్ కి చుట్టూ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. డెస్క్ కి డెస్క్ కి మధ్యలో ఒక డెస్క్ దూరం ఉండేలాగా అంటే ఆల్టర్నేటివ్ గా విద్యార్థులను కూర్చోబెట్టారు. విద్యార్థుల టెంపరేచర్ ని కూడా చెక్ చేస్తారు. ఫేస్ రికగ్నిషన్ స్కానర్ సహాయంతో అటెండెన్స్ వేస్తారు అంతేకాకుండా ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు కూడా అటెండెన్స్ అప్డేట్ ని పంపిస్తారు.

దీనిపై కన్లయ శ్రీమోంగ్ఖోల్ అనే విద్యార్థి మాట్లాడుతూ “ఇలా బాక్సులలో కూర్చుని చదువుకోవడం ఎంతో కొత్తగా ఉంది. పాఠశాల వాళ్ళు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి నేను భయం లేకుండా చదవగలుగుతున్నాను” అని చెప్పాడు.

సోపోన్విచ్ థియాంట్‌హాంగ్ అనే మరొక విద్యార్థి మాట్లాడుతూ “చదవడం, జాగ్రత్తలు అంతా బానే ఉంది కానీ ఇలా చుట్టూ ఉన్న బాక్స్ వల్ల నేను నా క్లాస్ రూమ్ మొత్తాన్ని చూడలేకపోతున్నాను. తల ఎటు తిప్పినా బాక్స్ గోడలే కనిపిస్తున్నాయి” అని అన్నాడు.

పాఠశాల సిబ్బందికి చెందిన చుచార్ట్ మాట్లాడుతూ “మేము పిల్లలకి ఫేస్ మాస్క్ లను అందజేస్తాం. ఒక్కొక్కసారి భద్రత కోసం ఫేస్ షీల్డ్ లను కూడా ఏర్పాటు చేస్తాం. క్లాస్ రూమ్ లో చదువుకునేటప్పుడు మాత్రమే కాకుండా తినేటప్పుడు కూడా సామాజిక దూరం ఖచ్చితంగా పాటించేలా  చూసుకుంటున్నాం” అని చెప్పారు.


End of Article

You may also like