తలపతి విజయ్ – వంశీ పైడిపల్లి “వారసుడు” సినిమా స్టోరీ ఇదేనా..? లేక ఆ హాలీవుడ్ మూవీ కాపీనా..?

తలపతి విజయ్ – వంశీ పైడిపల్లి “వారసుడు” సినిమా స్టోరీ ఇదేనా..? లేక ఆ హాలీవుడ్ మూవీ కాపీనా..?

by Mohana Priya

Ads

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.

Video Advertisement

తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. అదే విధంగా తలపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా తెలుగులో విడుదల అయ్యింది. తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ భాషలైన కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా విడుదల అయ్యింది.

thalapathy 66 vaarasudu story goes viral

తెలుగులో కూడా విజయ్ క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రూపొందుతోంది. ఈ సినిమా విజయ్ 66వ సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేసారు. ఇందులో విజయ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా పేరు తమిళ్ లో వారిసు అని పెట్టారు. తెలుగులో ఈ సినిమా పేరు వారసుడు అని పెట్టారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ విడుదల చేశారు. కానీ ఈ సినిమా స్టోరీపై చాలా కామెంట్స్ వస్తున్నాయి.

thalapathy 66 vaarasudu story goes viral

 

అందులో ఒక కామెంట్ మాత్రమే ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఒక నెటిజన్ సినిమా స్టోరీ గురించి ఈ విధంగా రాశారు. ఆ కామెంట్ లో సినిమా గురించి చెప్తూ ” విజయ్ మహేష్ బాబు, పూజా హెగ్డే కొడుకు. పై చదువుల కోసం వేరే దేశానికి పంపిస్తారు. ఇంతలో జగపతి బాబు కొడుకు వచ్చి వారి తండ్రి అలా అవ్వడానికి మహేష్ బాబు కారణం అని తెలుసుకుంటాడు.  దాంతో మహేష్ బాబుని చంపేయాలి అని నిర్ణయించుకొని ఆ ఊళ్లు అన్నిటినీ వారు తీసుకోవడానికి చూస్తాడు. అప్పుడు విజయ్ ఇండియాకి వస్తాడు. ఇక్కడ జగపతి బాబు కొడుకుతో ఫైట్ చేసి, తన తండ్రి మహేష్ చేసిన మంచి పనులని తను చేస్తాడు. అలా వారసుడు అవుతాడు” అని రాశారు.

thalapathy 66 vaarasudu story goes viral

ఇది మాత్రమే కాకుండా మరి కొంత మంది ఈ సినిమా పోస్టర్ చూస్తే హాలీవుడ్ సినిమా లార్గో వించ్ గుర్తొస్తోంది అని, దాంతో ఆ సినిమా స్టోరీ సినిమా స్టోరీ దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఏమో అని అంటున్నారు. కానీ లార్గో వించ్ సినిమా ఆధారంగా తెలుగులో అజ్ఞాతవాసి, సాహో సినిమాలు వచ్చాయి. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన కంత్రి సినిమా కథ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. మరి ఈ కథలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ప్రస్తుతం ఈ కామెంట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like