Ads
- చిత్రం : వారిసు
- నటీనటులు : విజయ్, రష్మిక మందన్న, ఆర్ శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ.
- నిర్మాత : దిల్ రాజు
- దర్శకత్వం : వంశీ పైడిపల్లి
- సంగీతం : తమన్
- విడుదల తేదీ : జనవరి 11, 2023
Video Advertisement
స్టోరీ :
స్టోరీ రాజేంద్రన్ (శరత్ కుమార్) అనే ఒక వ్యాపారవేత్తతో మొదలవుతుంది. రాజేంద్రన్ కి ఇద్దరు కొడుకులు. వారిలో మొదటి వాడు అయిన జై (శ్రీకాంత్), అజయ్ (శామ్) కి వారి తండ్రి ఛైర్మన్ పదవి మీద కన్ను ఉంటుంది. మీరు కాకుండా రాజేంద్రన్ కి మరొక కొడుకు కూడా ఉంటాడు. అతనే విజయ్ (విజయ్). విజయ్ కి తన తండ్రి లాగా కాకుండా వ్యాపారవేత్త లక్షణాలు ఏమీ ఉండవు.
వారికి పూర్తిగా విరుద్ధమైన ఆలోచన విధానం ఉంటుంది. అయితే రాజేంద్రన్ కి తనతో పాటు కలిసి వ్యాపారం చూసుకుంటున్న తన కొడుకుల మనస్తత్వం ఎలాంటిది అనేది తెలుస్తుంది. దాంతో రాజేంద్రన్ కి తన తర్వాత తన స్థానంలో కూర్చునే వాడు తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే వాడే అయ్యి ఉండాలి అని అనుకుంటాడు. దాంతో అసలు ఛైర్మన్ పదవి మీద కానీ, వ్యాపారం మీద కానీ ఎలాంటి ఆసక్తి లేని విజయ్ ని తన స్థానంలో కూర్చోబెడతాడు.
దీంతో రాజేంద్రన్ ఇద్దరు కొడుకులు కూడా వారి శత్రువు అయిన జయప్రకాష్ (ప్రకాష్ రాజ్) తో చేతులు కలుపుతారు. అసలు విజయ్ ఆ ఛైర్మన్ స్థానంలో కూర్చున్న తర్వాత ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? తన సొంత వాళ్లే తనకి ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించారా? వీటన్నిటి నుండి విజయ్ ఎలా బయటపడ్డాడు? ఆ ఛైర్మన్ పదవిలో ఎలాంటి పనులు చేశాడు? తనని తాను ఎలా నిరూపించుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
డైరెక్ట్ తెలుగు సినిమాల ద్వారా కాకపోయినా తమిళ్ డబ్బింగ్ సినిమాల ద్వారా దాదాపు ఒక తెలుగు స్టార్ హీరోకి ఉన్న క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్. తుపాకి సినిమా నుండి ఇప్పటివరకు కూడా విజయ్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతాయి దాదాపు తమిళ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అవుతాయి. అయితే విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు అంటే ఈ సినిమా తెలుగులో కూడా ఉంటుంది ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా పక్కా తమిళ్ సినిమా.
తెలుగులో చాలా గుర్తింపు ఉన్న ఎంతో మంది నటీనటులు ఈ సినిమాలో ఉన్నారు. మన ప్రేక్షకులకు కూడా సినిమా దగ్గర కావడానికి ఇలా చేశారు అని అర్థం అవుతోంది. సినిమా కథలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంతకుముందు మనం చాలా సినిమాల్లో చూసిన కథ. సినిమా మొత్తంలో కూడా ఎమోషనల్ గా బలంగా ఉండేలా వంశీ పైడిపల్లి కథని రాసుకున్నారు. చాలావరకు ఎమోషన్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలాగే ఉన్నాయి.
కానీ ఇవన్నీ కూడా మనం అంతకుముందు చాలా సినిమాల్లో చూసే ఉంటాం అని అనిపిస్తుంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా వారి పాత్రల పరిధి మేరకు నటించారు. కానీ సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు విజయ్. ఒక స్టార్ పవర్ ఉంటే సినిమా ఏ రేంజ్ కి వెళుతుంది అనేది ఈ సినిమా ద్వారా మరొకసారి నిరూపించబడింది అని అనొచ్చు. హీరోయిన్ రష్మిక చాలా కమర్షియల్ సినిమాల్లో ఉండే రెగ్యులర్ హీరోయిన్ పాత్ర పోషించారు.
పర్ఫార్మెన్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. విజయ్ తో కలిసి చేసిన పాటల్లో రష్మిక డాన్స్ మాత్రం హైలైట్ అయ్యింది. అలాగే ముఖ్య పాత్రల్లో నటించిన శరత్ కుమార్, జయసుధ, ప్రకాష్ రాజ్, యోగి బాబు వారితో పాటు హీరో అన్న వదినలుగా నటించిన శ్రీకాంత్, సంగీత, శామ్ వీరందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్ గా వెళ్ళిపోతుంది.
కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఎలివేషన్స్ సీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. సినిమాకి మరొక హైలైట్ తమన్ అందించిన సంగీతం. ఆ పాటలు వినడానికి, చూడడానికి చాలా బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొన్ని ఫైటింగ్స్, ఎలివేషన్స్ కూడా తెరపై బాగా కనిపించాయి. డైలాగ్స్ కూడా ఒకరకంగా సినిమాకి ప్లస్ అయ్యాయి అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
- విజయ్
- పాటలు
- సినిమాటోగ్రఫీ
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- పాత కథ
- ఎక్కడో చూసాం అనిపించినట్టు ఉండే సీన్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్:
సినిమా నుండి కొత్తదనం ఏమి ఆశించకుండా, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలి అనుకునే వారికి, అలాగే విజయ్ నుండి మంచి ఎలివేషన్ ఉన్న సినిమా చూడాలి అనుకునే వారికి ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఎమోషనల్ డ్రామాలో ఒకటిగా వారిసు సినిమా నిలుస్తుంది.
watch trailer :
End of Article