Home Filmy Adda గుంటూరు కారం నుంచి తమన్ అవుట్ అన్న వార్తలలో నిజం ఎంత…?

గుంటూరు కారం నుంచి తమన్ అవుట్ అన్న వార్తలలో నిజం ఎంత…?

by Mohana Priya

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఊర మాస్ చిత్రం గుంటూరు కారం. విడుదలకు ముందే ఈ చిత్రం ఎలిమినేషన్స్ లో నంబర్ వన్ అన్న టాక్ తో బాగా పాపులర్ అయింది. ఆల్రెడీ మూవీ నుంచి హీరోయిన్ గా అనుకున్న పూజ హెగ్డే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

ఇక ఈ మూవీ నుంచి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారని ఆయన ప్లేస్ లో రవి కె చంద్రన్ ఎంటర్ అయ్యాడని వార్తలు వచ్చాయి.ఇక ఆ తర్వాత గత కొద్ది కాలంగా మూవీ టీం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకుంటున్నట్లు పుకారు సినీ ఇండస్ట్రీలో షికారు చేస్తోంది.

thaman

నాగ వంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ డిజిటల్ హక్కులను నెట్లిక్ సంస్థ 80 కోట్లకు కొన్నదని తెలుస్తోంది. ఫుల్ పాజిటివ్ వైస్ తో సాగుతున్న ఈ చిత్రం చుట్టూ ఎందుకని ఇలా నెగటివ్ టాక్స్ తిరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే తమన్ విషయంలో వచ్చిన మాటలను నాగ వంశీ తో పాటు తమను కూడా ఖండించడం జరిగింది.

trolls on thaman about mahesh gunturu karam mass strike music..!!

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ను అసలు ఏం జరుగుతుందో అని మేము అడగం కానీ మీరు గుంటూరు కారం చిత్రం టీం లో ఉన్నారా లేదా అన్న ఒక్క విషయం కన్ఫర్మ్ చేయండి అని అడిగినప్పుడు , తమన్ తనదైన శైలిలో దానికి జవాబు ఇచ్చాడు. నిజంగా నేను చిత్ర యూనిట్ లో సభ్యుణ్ణి కాదు అనుకుంటే ఇప్పటికే ఆ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగేది.

అలా జరగలేదు అంటే విషయం ఏమిటి అనేది ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. ఇక దాని గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం కానీ ,క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పని కానీ లేదు అని తమన్ అన్నారు. తమన్ మాటలు ఇన్ డైరెక్ట్ గా ఇంకా అతను గుంటూరు కారం టీం లో భాగమే అని చెప్పినట్లు అందరూ భావిస్తున్నారు.

watch video :

ALSO READ : “బేబీ”లో నటించిన హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్‌ ఇంత తక్కువా..?

You may also like