ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సంగీత దర్శకులలో ఒకరు తమన్. అల వైకుంఠపురంలో, తర్వాత సోలో బ్రతుకే సో బెటర్, పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన యువరత్న, మాస్ మహారాజా రవితేజ కం బ్యాక్ మూవీ క్రాక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా వకీల్ సాబ్ తో పాటు గత ఏడాది నుండి ఎన్నో హిట్ పాటలు ఇచ్చారు తమన్.

Thaman records first song for Chiranjeevi Lucifer Telugu remake

ఇప్పుడు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట తో పాటు, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా, అలాగే పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు తమన్. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న లూసిఫర్ తెలుగు రీమేక్ కి కూడా సంగీతం అందించబోతున్నారు తమన్.

 

 

మెగాస్టార్ చిరంజీవితో తమన్ కి ఇది మొదటి సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు తమిళ్. లూసిఫర్ తెలుగు రీమేక్ కి సంబంధించిన మొదటి పాటని తమన్ ఇవాళ రికార్డ్ చేశారు. రికార్డింగ్ స్టూడియోలో పాట రికార్డ్ చేస్తున్న ఫోటోని కూడా విడుదల చేశారు తమన్.

 

 

ఫోటో షేర్ చేస్తూ, “నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. మెగాస్టార్ చిరంజీవి గారికి మొదటి పాట రికార్డ్ చేయాలి అనే కల నెరవేరింది. యూకేలోని, లండన్ లోని అబ్బే రోడ్ స్టూడియోస్ లో 60 పీస్ గ్రాండ్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా (philharmonic Orchestra) తో పాటని రికార్డ్ చేశాం. మెగాస్టార్ ని సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది” అని రాశారు. అంతే కాకుండా ఆ పాటకు సంబంధించిన మ్యూజిక్ నోట్స్ ఫోటో షేర్ చేసి, దర్శకుడు మోహన్ రాజాకి థాంక్స్ చెప్పారు తమన్. దాంతో అభిమానులు అందరికీ లూసిఫర్ రీమేక్ పై  అంచనాలు ఇంకా పెరిగాయి.