2 లక్షలకు పైగా జీతం.. ఏ దురలవాటూ లేదు.. కానీ ఆ ఒక్క ఆట ఎంత పని చేసింది.. భార్య పిల్లలని చంపేసి..చివరకి..?

2 లక్షలకు పైగా జీతం.. ఏ దురలవాటూ లేదు.. కానీ ఆ ఒక్క ఆట ఎంత పని చేసింది.. భార్య పిల్లలని చంపేసి..చివరకి..?

by Megha Varna

Ads

చెడు వ్యసనాలకు అలవాటు పడితే జీవితమే పూర్తిగా నాశనం అయిపోతుంది. అందుకే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాటు వల్లే తాజాగా ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక బ్యాంకు ఉద్యోగి తన భార్య, పిల్లల్ని చంపేసే తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

Video Advertisement

ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే.. పొరూర్‌లోని ఒక బ్యాంకులో మణికందన్ పనిచేస్తున్నాడు. మంచి పొజిషన్ లో ఉన్న మణికందన్ కి సంవత్సరానికి 28 లక్షలు వచ్చేది. అయినప్పటికీ ఏమి లాభం ఆన్లైన్ రమ్మీ కి బానిసగా మారి లక్షల రూపాయలు బెట్టింగ్ పెట్టి డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఆఖరికి అప్పులపాలైపోయాడు.

పైగా తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. డబ్బుల విషయంపై తన భార్యకి తనకి తరచూ గొడవలు అయ్యేవి. డిసెంబర్ 31న భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పు ఇచ్చిన వాళ్లు ఫోన్ చేస్తే ఏదో ఒక కారణం భార్య చేత చెప్పించి ఫోన్ పెట్టేయమనేవాడు. ఇంకెన్నాళ్లు ఇలా అంటూ తన భార్య నిలదీసింది. భార్య భర్తల మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. దీనితో తీవ్ర ఒత్తిడికి లోనైన మణికందన్ భార్య, పిల్లల్ని చంపేశాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

జనవరి 1న ఎంతసేపయినా తలుపు తీయడం లేదని ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన అపార్ట్మెంట్ కి చేరుకొని అతని ఫ్లాట్ లోకి వెళ్ళడానికి చూడగా.. తలుపు లోపలి వైపు లాక్ చేసి ఉంది. తలుపుని బద్దలుకొట్టి చూడగా మణికందన్ భార్య తార, ఇద్దరు పిల్లలు కూడా విగతజీవులుగా కనిపించారు.

మణికందన్ వంట గదిలో ఉరేసుకుని చనిపోయాడు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విపరీతంగా అప్పులు చేశాడని రమ్మీ లో డబ్బులు అంతా పోయాయని.. వాటిని చెల్లించలేని పరిస్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భార్యని క్రికెట్ బ్యాట్ తో కొట్టి, పిల్లలు ఇద్దరిని గొంతునులిమి హత్య చేసి మణికందన్ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.


End of Article

You may also like