Ads
మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడు బాగుంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు.అలాంటి కాలంలో బతుకుతున్న ప్రతి ఒక్కరు దేనిపై ఆశపడకుండా ఉన్న కొంత కాలాన్ని కొంత గుర్తింపులతో సంతోషంగా గడుపుతారు.
Video Advertisement
అలా ఎంతో మంది సామాన్య ప్రజలు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లినా కూడా వాళ్ళు చేసిన మంచి మంచి పనులు, సహాయాలను ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
అలాంటి వారిలో ఒకరు బాలనటి తరుణీ సచ్ దేవ్. ఈమె 15 ఏళ్ళ వయసులో ఒక విమాన ప్రమాదం లో మరణించింది. అప్పటికే ఆమె 50 కి పైగా ప్రకటనలు, సినిమాల్లో నటించారు. ఆమె “పా” చిత్రం లో అమితాబ్ స్నేహితురాలిగా నటించింది.
ఆమె 14 మే 1998న జన్మించింది అలాగే తన పుట్టిన రోజునే 14 మే 2012న విమాన ప్రమాదంలో మరణించింది, అయితే తేదీ 14తో పాటు చాలా విచిత్రం ఉంది. ఆమె మరణించే ముందు తన స్నేహితులతో మాట్లాడిన మాటలను అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాయి.
ఆమె తన తల్లితో కలిసి విహారయాత్ర కోసం నేపాల్‌కు బయలుదేరే ముందు తన స్నేహితులకు వీడ్కోలు చెప్పడానికి కలుసుకుంది.అప్పుడు తరుణి తన స్నేహితులందరినీ కౌగిలించుకొని, నేను మిమ్మల్ని చివరిసారిగా కలుస్తున్నాను అని చెప్పింది.ఇంతకు ముందు ఎప్పుడు ఆమె ఆలా మాట్లాడలేదని ఆమె స్నేహితులు అన్నారు.
ఫ్లైట్ ఎక్కే ముందు ఆమె తన స్నేహితుడికి మెసేజ్ పంపి, విమానం కూలిపోతే ఏమవుతుంది అని సరదాగా అడిగింది మరియు ఆమె తన చివరి సందేశాన్ని కూడా పంపింది, “ఐ లవ్ యు” అని. ఆమె ఫ్లైట్ ఎక్కింది మరియు దురదృష్టవశాత్తూ అదే ఆమెకు చివరి ఫ్లైట్. తరుణి తన తల్లి గీత సచ్దేవ్ తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా విమానం ప్రమాదానికి గురికావడంతో అక్కడికక్కడే తరుణి తో సహా ఎంతో మంది ప్రాణాలు వదిలారు.
కరిష్మా కపూర్‌తో ఆమె చేసిన రస్నా ప్రకటన తరుణికి చాలా గుర్తింపు తెచ్చింది. అందులో ఆమె అనే ఐ లవ్ యు రస్నా అనే ట్యాగ్ లైన్ భారత దేశమంతా మారు మోగిపోయింది. సినీ పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలనుకున్న తరుణి తన కోరిక తీరకుండానే.. చిన్న తనం లోనే మరణించడం తో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు చాలా విచారించారు.
End of Article