Ads
మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ సమకాలీన విషయాలపై స్పందిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే.అయితే పరోటా లు రోటీల లిస్ట్ లో లేవు కాబట్టి పరోటాల మీద 18 శాతం జిఎస్టి విధిస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది.అయితే ఈ విషయంపై ఆనంద్ మహీంద్రా స్పందించారు కాగా ఆనంద్ మహీంద్రా రిప్లై ఇప్పుడు అంతటా వైరల్ గా మారింది..వివరాల్లోకి వెళ్తే .
Video Advertisement
రోటి తయారీకి పరోటా తయారీకి మధ్య చాలా వృత్యాసం ఉంది అని అందుకే వాటిని 1905 విభాగంలో చేర్చలేమని ఏఏఆర్ స్పష్టం చేసింది.దేశం ఇప్పటికే చాలా రకాల విపత్తులను ఎదుర్కొంటుంది అని ఆ విపత్తుల లిస్ట్ లో పరోటా కూడా చేరిందని ఆనంద్ మహీంద్రా అన్నారు.అయితే కొత్తగా “పరోటీస్” అనే ఆహార పదార్ధం మార్కెట్ లోకి వస్తుందని నేను విశ్వసిస్తున్నాని ఆనంద్ మహీంద్రా అన్నారు.భారత దేశంలో ప్రజలు తినే ఆహారంలో ముఖ్యమైంది పరోటా.అలంటి పరోటా లపై జిఎస్టీ రేటు పెంచి ప్రజలని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
With all the other challenges the country is facing, it makes you wonder if we should be worrying about an existential crisis for the ‘Parota.’ In any case, given Indian jugaad skills, I’m pretty sure there will be a new breed of ‘Parotis’ that will challenge any categorisation! https://t.co/IwHXKYpGHG
— anand mahindra (@anandmahindra) June 12, 2020
End of Article