Ads
చాలా రోజులు, సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు. కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది.
ఈ సినిమాకి imdb లో కూడా చాలా తక్కువ రేటింగ్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే గత నెలలో విడుదలైన శరవణ స్టోర్స్ ఓనర్ శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్ సినిమాకి లైగర్ సినిమాకంటే ఎక్కువ రేటింగ్ ఉంది. ది లెజెండ్ సినిమాకి 4.7 రేటింగ్ ఉంటే, లైగర్ సినిమాకి సినిమాకి 1.7 రేటింగ్ ఉంది. సినిమా విడుదలైన రోజు నుండి కూడా నెగటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అందుకు ముఖ్య కారణం సినిమాపై భారీగా అంచనాలు ఉండటం.
స్టార్ డైరెక్టర్ సినిమా కావడంతో, అది కూడా పాన్ ఇండియన్ సినిమా కావడంతో భారతదేశం అంతా కూడా ఒక రకంగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. ముంబైలో కూడా సినిమా బృందం ప్రమోట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది జనాలు వచ్చారు. ఈ సినిమాకి అక్కడ కూడా క్రేజ్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. కానీ సినిమా మాత్రం విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అసలు సినిమా బృందం సినిమా విడుదల అయ్యే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకి ఈ సినిమాకి ఏం సంబంధం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
End of Article