Ads
ప్రతి ఆదివారం ఈ టీవీలో మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మామూలుగా అయితే ఆదివారం పూట ఎక్కువగా సినిమాలు టెలికాస్ట్ చేస్తారు. కానీ ఈ టీవీ మాత్రం డిఫరెంట్ గా ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తుంది. అది కూడా మధ్యాహ్నం పూట ఈ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది. ప్రతి వారం ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వివిధ రంగాలకి చెందిన ప్రముఖులను గెస్ట్ లుగా ఆహ్వానించి, జబర్దస్త్ లో కమెడియన్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.
Video Advertisement
ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.అయితే ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇటీవల టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో ఒక వృద్ధాశ్రమానికి చెందిన కొంత మంది వృద్ధులను అతిధులుగా ఆహ్వానించారు. వీరు తాము ఏ పరిస్థితులలో వృద్ధాశ్రమానికి రావాల్సి వచ్చిందో చెప్పారు. దాంతో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న వాళ్లు అంతా కన్నీటిపర్యంతమయ్యారు. ప్రేక్షకులని కూడా ఈ ఎపిసోడ్ చాలా కదిలించింది.
అయితే వీరందరూ “ద నెస్ట్ హోం” అనే వృద్ధాశ్రమానికి చెందినవారు. ప్లే ఈవెన్ అనే యూట్యూబ్ ఛానల్ వృద్ధాశ్రమంకి వెళ్లి అక్కడ ఉన్న వారిని పలకరించింది. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ కి వచ్చిన వారు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది పెద్దవారు తమ కన్నీటి గాధని యూట్యూబ్ ఛానల్ వారికి వివరించారు. ఒక పెద్దావిడ భర్త, కొడుకు కూడా ఇదే వృద్ధాశ్రమంలో మరణించారట. ఇలా ఎంతో మంది వృద్ధులని తమ సొంత వాళ్లే కాదు అనుకుని వదిలేస్తున్నారు.
watch video :
End of Article