100 కోట్ల క్లబ్ లో స్థానం లేని ఏకైక స్టార్ హీరో.. ఎవరో తెలుసా..!

100 కోట్ల క్లబ్ లో స్థానం లేని ఏకైక స్టార్ హీరో.. ఎవరో తెలుసా..!

by Sunku Sravan

సినిమా ఫీల్డ్ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో హీరోల మార్కెట్ ప్రతి సినిమాకు మారుతూనే ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది హీరోలు ఐదు సంవత్సరాల కాలంలోనే వారి యొక్క మార్కెట్ ఏకంగా వంద కోట్లు దాటేశారు. ఈ క్రమంలోనే ప్రతి సినిమా సినిమాకు మార్కెట్ చేంజ్ అవుతూ వస్తోంది. ఇండస్ట్రీలో టాప్ మరియు మీడియం స్మాల్ రేంజ్ ప్రకారం టైపు 1,2,3 అనే మూడు భిన్నమైన కేటగిరీలో హీరోల మార్కెట్ ను పోలుస్తున్నారు. ముఖ్యంగా వంద కోట్ల క్లబ్ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీ లో ఉన్నటువంటి టాప్ హీరోలు అందరూ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తున్నారు.

Video Advertisement

ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. అయితే ఇప్పటికీ ఆ రికార్డుని అందుకోని స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ నెంబర్వన్ హీరోలలో సమానంగా కొనసాగుతారు. మిగతా హీరోల డైరెక్టర్స్ కాంబినేషన్లో వారి యొక్క మార్కెట్ ను పెంచుకుంటూ ఉంటే కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయనకు ఉన్నటువంటి స్టార్ ఇమేజ్ తోనే ఒక్కసారి సినిమాకు హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు.బీమ్లానాయక్ మూవీ తో పవన్ 100 కోట్ల క్లబ్ లో చేరుతారని అనుకుంటే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 నుంచి 95 కోట్ల మధ్యలో షేర్స్ వసూలు చేసింది.

bunny charan ntr

అయితే ఆ సమయంలో ఏపీలో టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల సినిమా టికెట్లపై ప్రభావం పడిందని భావించారు. ఎందుకంటే బీమ్లానాయక్ వంద కోట్ల క్లబ్లో చేరుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. మిగతా అగ్ర హీరోలు అందరూ 100 కోట్ల షేర్స్ ను చాలా సులువుగా సాధిస్తున్నారు. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ మాత్రమే చేరాల్సి ఉంది. మరి రాబోయే సినిమాలో అయినా ఈ రికార్డును సాధిస్తారో లేదో వేచి చూడాలి.


You may also like