ఇది నా 50 వ చోరీ…జూన్ 9 న దొంగతనం చేస్తానంటూ లెటర్.! ఆ దొంగ ధైర్యం ఏంటో?

ఇది నా 50 వ చోరీ…జూన్ 9 న దొంగతనం చేస్తానంటూ లెటర్.! ఆ దొంగ ధైర్యం ఏంటో?

by Megha Varna

Ads

సినిమాలలో హీరోలు నేను ని ఇంటికి వస్తాను,కచ్చితంగా ఈ సమయానికి వచ్చి నిన్ను కొడతాను నీకు దమ్ము దైర్యం ఉంటె ని చేతనైంది చేసుకో అని విలన్లకు వార్నింగ్ లు ఇవ్వడం లాంటి సీన్ లు మనం ఇప్పటిదాకా చాలానే చూసాం.అయితే మధ్యప్రదేశ్ లో ఓ దొంగ ఇదే విధంగా నేను కచ్చితంగా ఈ సమయానికి వచ్చి దొంగతనం చేస్తాను మీ చేతనైంది చేసుకోండి అంటూ ఒక లేఖ ద్వారా తెలిపాడు.కాగా ఈ సంఘటన అంతటా కలకలం రేపుతోంది.ఆ వివరాలేంటో చూద్దాం ..

Video Advertisement

representative image

మధ్యప్రదేశ్ లోని ఛింద్వాల్ లో ఇప్పటికే వరుసగా చాలా దొంగతనాలు జరిగాయి.డబ్బు ,బంగారం,వాహనాలు చోరీ చెయ్యబడ్డాయి.అయితే తాజాగా ఛింద్వాల్ లో ఓ ఇంటి ముందు ఓ లేఖ దర్శనమిచ్చింది.ఇది నా 50 వ దొంగతనం కాబట్టి స్పెషల్ గా ముందే తెలియచేస్తున్నాను నేను వచ్చి దొంగతనం చేస్తాను.

మీరు మీ బండ్లకు మీ ఇళ్లకు తాళాలు వేసుకొంటే వేసుకోండి.ఎందుకంటే మా టీం చాలా పెద్దది అని తెలియచేసాడు ఆ దొంగ .దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు ఈ లేఖ ను పోలీసులకు అందచేశారు.అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు.


End of Article

You may also like