మేడారం జాతరలో.. వీరి సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసా.? ఈ లెక్కలు చూడండి.!

మేడారం జాతరలో.. వీరి సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసా.? ఈ లెక్కలు చూడండి.!

by Harika

Ads

శివశక్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ళు, బంగారమెత్తుకొని బయలుదేరిన భక్తులు. కనుచూపుమేలలో ఇసుకేస్తే రాలనంత జనంతో తెలంగాణ కుంభమేళా అదేనండి ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర కనువిందుగా జరుగుతుంది. ఈ జాతరకు సమ్మక్క సారలమ్మలకు అత్యంత ప్రియమైన బంగారాన్ని( బెల్లం) నెత్తిన పెట్టుకొని మొక్కులు చెల్లించుకునేందుకు పోటు ఎత్తుతున్నారు భక్తజనం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవార్లకు మొక్కు చెల్లింపుల్లో ప్రధానమైనది బెల్లం.

Video Advertisement

medaram jathara 4

కోరిన కోరికలు తీరితే ఎత్తు బంగారం( బెల్లం) సమర్పించుకుంటామని మొక్కుకున్నవారు సమ్మక్క పున్నం( పౌర్ణమి) నుంచి మొదలుకొని జాతర వరకు బెల్లాన్ని సమర్పించుకుంటూ ఉంటారు. మేడారం జాతరకు నెలరోజులు ముందు నుంచే బెల్లం వ్యాపారం జోరు అందుకుంటుంది. వరంగల్ ప్రాంతానికి భారీగా బెల్లం దిగుమతి జరుగుతుంది వరంగల్ జిల్లాకు పాత బీట్ బజార్ నుంచి అత్యధికంగా బెల్లం రవాణా అవుతుంది. ఉమ్మడి వరంగల్లోని వివిధ ప్రాంతాలకు టోకుగా కూడా ఇక్కడి నుంచే వ్యాపారులు తీసుకువెళ్తారు.

ఇటీవల జనగాం, మహబూబాబాద్, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్, గోపాలపల్లి, ములుగు ఇతర పట్టణాల్లో కూడా బెల్లం వ్యాపారం జోరుగా సాగుతుంది. మామూలు రోజుల్లో సుమారు పది టన్నుల వరకు వ్యాపారం జరిగితే జాతర సమయంలో 35 నుంచి 40 టన్నుల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. టోకువర్తకమే 14 కోట్ల వరకు అవుతుంది. చిల్లర ధరతో దాదాపుగా జాతర పేరిట 20 కోట్ల విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఈ జాతర బంగారం( బెల్లం) వ్యాపారులకు జాక్పాట్ అనే చెప్పాలి. ఈ రోజుల్లో వీరి ఆదాయం మామూలుగా ఉండదు. కొందరు వ్యాపారులు సిండికేట్ గా మారి బెల్లం రేట్ ను నియంత్రిస్తారని సమాచారం. అయితే వారికి ఎక్సైజ్ శాఖ అధికారులు అండగా ఉంటారని ఆరోపణలు కూడా ఉన్నాయి. హోల్ సేల్ మార్కెట్ లో బెల్లం 30 నుంచి 35 రూపాయలు ఉండగా సిండికేట్ వ్యాపారులు మాత్రం పది రూపాయల వరకు ధర ఎక్కువ పెంచి విక్రయిస్తారని తెలిసింది.


End of Article

You may also like