Ads
తన కామెడీతో అందర్నీ నవ్విస్తూ అద్భుతమైన హాస్యాన్ని పండించాడు హైపర్ ఆది. జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది స్కిట్స్ చూస్తే ఎవరైనా కడుపుబ్బా నవ్వు తారు. అయితే ఒక్కొక్కసారి అతడి పంచులే కాంట్రవర్సీలుగా మారతాయి. వాటిలో భాగంగా ఓ హీరో అభిమానులు నుంచి బెదిరింపులు వచ్చాయట. అయితే అసలు ఏం జరిగింది అనే విషయాన్ని చూస్తే..
Video Advertisement
దీపావళి సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ లో జరిగిన ఫెస్టివల్ ఈవెంట్ లో హైపర్ ఆది ఒక హీరో డైలాగులు చెప్పి కామెడీ చేశాడు. అయితే అంతా బాగా నవ్వుకున్నారు కానీ ఆదికి మాత్రం కష్టాలు తప్పలేదు. ఒక హీరో పై పంచులు వేయడంతో ఆ హీరో అభిమానులు ఆది పై కోపంతో మండిపడుతున్నారు.
పైగా దాడి చేయాలని వెతకడం కూడా మొదలెట్టేశారు. దీనికి భయపడి షూటింగ్ కి వెళ్ళలేదు అదే విధంగా ఇంట్లో కూడా ఉండ లేక సొంత వాహనంలో కూడా తిరగలేక రెండు రోజుల నుంచి చిక్కుల్లో పడ్డాడు ఆది. అయితే గతంలో కూడా హైపర్ ఆదికి ఇలాంటి సంఘటన ఎదురైంది అప్పుడు అతను క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇప్పుడు కూడా అదే జరిగేట్టు వుంది మరి.
End of Article