Ads
ఈ కాలంలో ఉన్న టాప్ హీరోలను చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా నటిస్తున్నారు. అయితే అప్పట్లో ఉండే హీరోయిన్లు ఈ టాప్ హీరోలతో జతకడితే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా..?
Video Advertisement
అప్పట్లో విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్ మీనా లాంటి ఎందరో అందాలతారలు ఉన్నారు. అద్భుతమైన నటనతో ఆ హీరోయిన్లు మెప్పించేవారు. వారు ఇప్పుడున్న హీరోలుతో… అంటే మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మొదలైన హీరోలతో నటిస్తే ఎలా ఉంటుందని ఊహించుకుంటే చాలా అందంగా ఉంటుంది. అయితే అది జరగని పని. కానీ ఈ హీరోలతో ఆ హీరోయిన్స్ ని ఇప్పుడు సెట్ చేద్దాం.
#1. మహేష్ బాబు – శ్రీదేవి:
సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పటి అందాల తార శ్రీదేవి తో జత కడితే చాలా అందంగా ఉంటుంది. ఈ అతిలోక సుందరి మహేష్ బాబుతో నటిస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు. కానీ జరగని పనే.
#2. జూనియర్ – ఎన్టీఆర్ విజయశాంతి:
ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి విజయశాంతి బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు కూడా ఈమె కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఈ తార ఎన్టీఆర్ తో నటిస్తే అదిరిపోతుంది కదా..!
#3. రామ్ చరణ్- రాధిక:
అప్పట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు రాధిక నటించి మెప్పించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాధికతో సినిమా వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం.
#4. అల్లు అర్జున్ – సాక్షి శివానంద్:
సాక్షి శివానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. అద్భుతమైన నటనతో ఈమె ఆకట్టుకుంటారు. ఈమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జోడి కడితే ఎవరైనా వావ్ అంటారు.
#5. ప్రభాస్ – సిమ్రాన్:
అప్పుడు పాపులర్ అయ్యిన తారల్లో సిమ్రాన్ కూడా ఒకరు. ఈమె కూడా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. ప్రభాస్ తో సిమ్రాన్ కాంబినేషన్ ఊహించుకుంటేనే అదిరిపోతోంది. మరి నిజంగా జరిగితే ఇక పండగలా ఉంటుంది. కానీ జరగని పనే.
#6. ఎన్టీఆర్ – రమ్యకృష్ణ:
రమ్య కృష్ణ కి అల్లుడిగా ఎన్టీఆర్ నటించారు. కానీ నిజంగా ఎన్టీఆర్ హీరో పాత్ర చేసి హీరోయిన్ గా రమ్యకృష్ణ చేస్తే బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే.
#7. ప్రభాస్ – టబు:
ఎంతో అందంగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది టబు. అల వైకుంఠపురం లో తల్లి క్యారెక్టర్ చేశారు టబు. ఈమెతో ప్రభాస్ జతకడితే చూడడానికి రెండు కళ్లూ చాలవేమో.
#8. రామ్ చరణ్ – రాధ:
రాధ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే నిజంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఊహించుకోవడానికి చాలా బాగుంది కదా..!
#9. విజయ్ దేవరకొండ – రంభ:
రంభ విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటేనే అదిరిపోయేలా ఉంది. నిజంగా ఇది జరిగితే ప్రేక్షకులకి పండగే.
#10. రానా దగ్గుబాటి – నగ్మా:
నగ్మా అప్పట్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను చేశారు. రానా కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే హిట్ అవ్వక తప్పదు.
#11. నాని – సౌందర్య:
నాచురల్ స్టార్ నాని నటి సౌందర్య తో ఈ కలిసి చేయడం కుదరదు. కానీ ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పటికీ కుదరని కాంబినేషన్స్ అయినప్పటికీ ఊహించుకోవడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ కాంబినేషన్స్.
End of Article