“శంకర్” పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో… ఆ 3 స్టార్ హీరోలు..! ఎవరంటే..?

“శంకర్” పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో… ఆ 3 స్టార్ హీరోలు..! ఎవరంటే..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాతో, అలాగే రణవీర్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్. ఒకవైపు తెలుగు సినిమా, మరోవైపు హిందీ సినిమా చేస్తూ, ఆ సినిమాలని పాన్-ఇండియన్ రేంజ్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Video Advertisement

అలాగే సినిమాలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ కూడా ఇటీవల షూట్ చేసినట్టు సమాచారం. ఆ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

ram-charan--shankar-movie

ఇందులో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే రణవీర్ సింగ్ తో శంకర్ చేస్తున్న సినిమా అపరిచితుడు సినిమా రీమేక్ అని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అది రీమేక్ కాదు అని, శంకర్ ఒక ఒరిజినల్ సినిమా రణవీర్ సింగ్ తో చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్-2 సినిమాకి కూడా శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

మధ్యలో కొన్ని రోజులు ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల మొదలయ్యింది. ఇదిలా ఉండగా శంకర్ మరొక సినిమా రూపొందించడానికి కథ రాసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఇది పాన్-ఇండియన్ రేంజ్ సినిమా అని, ఇందులో ముగ్గురు పెద్ద స్టార్ హీరోలు నటిస్తారని సమాచారం. వారు సూర్య, యష్, అలాగే రణవీర్ సింగ్ అని అంటున్నారు.

jai bhim review

ఈ సినిమాని తమిళ్ లో బాగా ఫేమస్ అయిన వేల్‌ప‌రి అనే నవల ఆధారంగా రూపొందిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా మూడు భాగాలుగా రూపొందుతుంది. శంకర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు అయిపోగానే ఈ సినిమాపై పని చేయడం మొదలు పెడతారు అని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే బాహుబలి తర్వాత అంత గ్రాండ్ గా రూపొందుతున్న సినిమా ఇదే అవుతుంది అని అంటున్నారు.


End of Article

You may also like