జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది.

ఈ షోలో ఇటీవల రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు మరొక ఇద్దరు సెలబ్రిటీలు షో కి గెస్ట్ గా రాబోతున్నారు. వారు మరెవరో కాదు. దర్శకుడు రాజమౌళి, అలాగే లెజెండ్ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు గారు. వీరిద్దరూ ఎవరు మీలో కోటీశ్వరులు సెట్ లొకేషన్ దగ్గర ఉన్న ఫోటోలు, అలాగే రాఘవేంద్ర రావు గారు జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో జూనియర్ ఎన్టీఆర్ సూట్ లోనే ఉన్నారు. కాబట్టి దాని బట్టి చూస్తే ఎన్టీఆర్ షో షూటింగ్ లో ఉన్నారు అని మనకి అర్థమైపోతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.