మన చట్టంలో ఒక వీధి కుక్కని చంపితే శిక్ష ఏంటో తెలుసా.?

మన చట్టంలో ఒక వీధి కుక్కని చంపితే శిక్ష ఏంటో తెలుసా.?

by Mohana Priya

Ads

విశ్వాసం అంటే గుర్తొచ్చేది కుక్క. ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్క కనిపిస్తే దానికి ఒక్కసారి తినడానికి ఏమైనా పెట్టండి. అది మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటుంది. కానీ చాలామంది కుక్కని అదోరకంగా చూస్తారు.

Video Advertisement

ఉదాహరణకి ఇప్పుడు కుక్క లాగా తోక ఆడిస్తున్నావ్ అని ఏదో తప్పు లాగా అంటారు. నీ బుద్ధి అంతే కుక్క బుద్ధి అంటారు. ఒకవేళ ఎవరైనా తమ పెంపుడు కుక్కలకు కొంచెం విలువ ఇస్తే కుక్కని మనిషి లాగా చూస్తున్నారు అని వెక్కిరిస్తారు. ఒకసారి మీరే ఆలోచించండి మనుషులతో పోలిస్తే కుక్కలు అంత తీసి పడేసేవా?

అంత హీనంగా చూసే అంత పనులు ఏం చేశాయని వాటిని కొట్టడం, దగ్గరకొస్తే తన్నడం, రాళ్లు విసిరి కొట్టడం చేస్తూ ఉంటాం. మనిషికి దెబ్బ తగిలితే నోరు తెరిచి చెప్పి దెబ్బకి ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాడు. మూగజీవాలు వాటి బాధలు ఎవరికి చెప్తాయి. ఆకలేస్తే మనిషైతే తనకు ఏం కావాలో అది తీసుకొని తినగలరు. వాటి పరిస్థితి ఏంటి?

మనిషి తనకి ఎవరైనా సహాయం చేస్తే మహా అయితే పది రోజులు గుర్తు పెట్టుకుంటాడు.తర్వాత తన పనిలో పడి మర్చిపోతాడు. అది మనిషి లక్షణం అంతే. మన నుండి తిరిగి ఏమీ ఆశించకుండా మనం వాటికి సహాయం చేశాం లేదా ఆశ్రయం ఇచ్చాం అనే ఒక్క కారణంతో మనల్ని ఇంతగా ప్రేమించే కుక్కలకి మనం తిరిగి చేస్తోంది ఏంటి? కొట్టడం, తన్నడం, విసుక్కోవడం.

ఒకొక్క సారి చూసుకోకుండా వాటిపై నుండి వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. అంటే మనుషులు చేసే కొన్ని పనుల వల్ల కుక్కల ప్రాణాలు కూడా రిస్క్ లో పడతాయి.

పైన చెప్పినవి అందరి గురించి కాదు. చాలామంది మూగ జీవాలపై ఇష్టంతో తమకి చేతనైనంత సహాయం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్లే ఇలా మూగజీవాలను హింసించినప్పుడు చూసి అడ్డుకుంటూ ఉంటారు. మనిషి ఏదైనా చేయడం వల్ల ఒక కుక్క చనిపోతే దానికి పోలీసులు వేసే జరిమానా ఎంతో తెలుసా? 50 రూపాయలు. విశ్వాసం ధర 50 రూపాయలు.

ఒక్కసారి ఆలోచించండి మనిషి ప్రాణం మాత్రమే ప్రాణం కాదు కదా? వాటికి కూడా ప్రాణం ఉంటుంది కదా? మనం వాటిని ఉద్ధరించాల్సిన అవసరం ఏమీ లేదు. కుక్క ఎదురుగా కనిపిస్తే ఒకవేళ అరవకుండా మామూలుగా ఉంటే కొట్టకుండా వదిలేద్దాం. దారిలో అడ్డంగా వస్తే పక్క నుండి వెళ్లడానికి ప్రయత్నిద్దాం. మన దగ్గరికి వస్తే ముట్టుకోకపోయినా పర్లేదు ఈసడించుకోకుండా వదిలేద్దాం.

మనం బయట కుక్కలకు ఆహారం పెట్టక పోయినా పర్లేదు కానీ పాడైపోయిన ఆహారం మాత్రం పెట్టకుండా ఉందాం. అలాగే పెంపుడు కుక్కలకు మనం తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారం కాకుండా వాటికి కూడా కొంచెం ఆహారాన్ని వండుదాం. ఇందాక పైన చెప్పినట్టు అవి మన నుండి కొంచెం మానవత్వం తప్ప ఇంకేమీ ఆశించవు.

బహుశా మనం సహాయం చేశామని అవి నోటితో అందరికీ చెప్పలేకపోవచ్చు కానీ మన సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. మాట్లాడి మర్చి పోవడం కంటే సహాయాన్ని గుర్తు పెట్టుకోవడమే గొప్ప విషయం కదా? మనం మనుషులం. కాబట్టి మనుషుల్లా మానవత్వంతో ఉందాం. అదే మనం మూగజీవాలకు చేయగలిగే అతిపెద్ద సహాయం.


End of Article

You may also like