ఈ ఐపీఎల్ లో మనం బాగా మిస్ అవుతున్నవి ఇవే..! అన్నిటికంటే ఎక్కువగా మిస్ అవుతుంది?

ఈ ఐపీఎల్ లో మనం బాగా మిస్ అవుతున్నవి ఇవే..! అన్నిటికంటే ఎక్కువగా మిస్ అవుతుంది?

by Megha Varna

Ads

చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత ఎట్టకేలకు ఐపీఎల్ మొదలైంది. సెప్టెంబర్ 19 వ తేదీన అబుదాబిలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మొదటి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు పై విజయం సాధించింది.

Video Advertisement

రెండవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి మధ్య జరుగుతోంది. ఐపిఎల్ స్టార్ట్ అయితే అయ్యింది కానీ, ఐపీఎల్ హంగామా అసలు ఎక్కడా లేదు. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం చైనా ని ఇంతలా తలుచుకుంటుంది, కాదు తిట్టుకుంటుంది అని చైనా కూడా ఊహించలేదేమో. ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా ఏం లాభం లేదు అనుకోండి. కానీ అసలు ఐపిఎల్ అంటే ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. కానీ ఈసారి మాత్రం ఎగ్జైట్మెంట్, హంగామా అన్ని ఇంటికే పరిమితం అవుతున్నాయి. అలా ఈసారి ఐపీఎల్ లో మిస్ అయినవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

మొట్టమొదటగా మాట్లాడుకోవాల్సింది ఆడియన్స్ గురించి. చాలా మంది టీవీలో చూడటానికి ఇష్టపడతారు కానీ, కొంత మంది మాత్రం స్టేడియం కి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. టీవీలో చూసే వాళ్ళకి కూడా స్టేడియంలో ఫ్యాన్స్ చేసే సందడి చూస్తే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఈసారి అది కొంచెం తక్కువగానే ఉంది.

ఇంకొకటి చీర్ లీడర్స్. మ్యాచ్ తో పాటు మధ్య మధ్యలో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు చీర్ లీడర్స్. ఎవరైనా క్రికెటర్ ఫోర్ లేదా సిక్స్ కొట్టినప్పుడు ఆ మూమెంట్ లో అభిమానులకి వచ్చే హ్యాపీనెస్ ని డాన్స్ రూపంలో ప్రజెంట్ చేస్తారు చీర్ లీడర్స్. మిస్ అయిన విషయాల్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాల్ బాయ్స్ కూడా లేరు. ఫీల్డర్స్ వెళ్లి బాల్ వెతికి తెచ్చుకోవాలి. అంతకుముందు హోమ్ గ్రౌండ్స్ ఉండేవి. ఇప్పుడు ఒకటే గ్రౌండ్ ఉంది.

ఐపీఎల్ అభిమానుల్లో చాలా మంది మిస్ అయ్యేది మయంతి లాంగర్ ని. ఐపీఎల్ కి, మయంతి లాంగర్ కి మ్యూచువల్ ఫాన్స్ ఉంటారు. ఈసారి ఐపీఎల్ లో మయంతి లాంగర్ ఉంటుందా అని ట్విట్టర్ లో ఎవరో ప్రశ్నిస్తే స్టార్ స్పోర్ట్స్ వాళ్లు మయంతి లాంగర్ ఈసారి ఉండరు అని రిప్లై ఇచ్చినప్పుడు ఎంతో మంది హార్ట్స్ బ్రేక్ అయ్యే ఉంటాయి.  అంత క్రేజ్ ఉంది మరి.


End of Article

You may also like