నెక్స్ట్ అల్లు అర్జున్ ఇతనే… ఒక్క పాటతో తెలుగులో ఫేమస్ అయిపోయాడు..! అసలు ఎవరు ఇతను..?

నెక్స్ట్ అల్లు అర్జున్ ఇతనే… ఒక్క పాటతో తెలుగులో ఫేమస్ అయిపోయాడు..! అసలు ఎవరు ఇతను..?

by Mounika Singaluri

Ads

తాజాగా మలయాళం లో RDX అనే మూవీ వచ్చింది. RDX అంటే రాబర్ట్, డానీ, జేవియర్. ఇది మలయాళంలో మంచి హిట్ అయింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అతని పేరు “షేన్ నిగమ్”. ప్రముఖం మలయాళీ సినిమాలో నటించిన నటుడు. మలయాళం లో ఇతనికి మంచి క్రేజే ఉంది. కాకపోతే మొన్నటి వరకు మలయాళం లోనే ఫేమస్ అయిన ఇతను ఇప్పుడు ఒకే ఒక్క సాంగ్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయాడు.

Video Advertisement

ఇతను నటించిన RDX మూవీలోని నీల నీలవే సాంగ్ అయితే యూట్యూబ్ లో మిలియన్ వ్యుస్ తో దూసుకుపోతుంది. ఒక్క సాంగ్ సరిపోతుంది మనల్ని సెన్సేషన్ చేయడానికి అనడానికి ఈ సాంగ్ ఏ ఒక ఎగ్జాంపుల్.

ఈ నటుడు షేన్ నిగమ్  2013 లో నీలాకాశం పచ్చకాదల్ చువన్న భూమి సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత 2016 లో కిస్మత్, 2017 లో పరవ, 2019 లో కుంభలంగి నైట్స్, ఇష్క్, 2022లో భూతకాలం వంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందాడు. తాజాగా 2023 లో RDX మూవీ తో ఒక సెన్సేషన్ అయిపోయాడు. ఇప్పుడు తెలుగులో కూడా ఈ హీరోకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కంటెంట్ నచ్చితే చాలు తెలుగు వారు నెత్తిన పెట్టుకుంటారు అనడానికి ఇదొక ఉదాహరణ.

ఇదే సాంగ్ కి తెలుగు లో  ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ రీల్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు కూడా. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ సాంగ్ కి 5 కోట్ల 30 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. ఇతన్ని చూసిన వారందరు కూడా షేన్ నిగమ్ డ్యాన్స్ చూస్తే అల్లు అర్జున్ గుర్తొస్తున్నారు. ఒక వేళ యాక్టింగ్ కూడా అలాగే చేస్తే నెక్స్ట్ అల్లు అర్జున్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని అంటున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సి ఎస్ ఈ RDX సినిమాకి సంగీతం అందించాడు. ఎటువంటి అంచనాల లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి రిజల్ట్ సాధించింది. ఇక మీదట ఈ హీరో నటించే సినిమాలు వరుస పెట్టి తెలుగు లో విడుదలవుతాయి ఏమో చూడాలి.ఈ సూపర్ హిట్ సాంగ్ ని మీరు కూడా వినండి.

Watch Song:

ALSO READ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… సలార్ పార్ట్2 కూడా వెంటనే రిలీజ్


End of Article

You may also like