Home Bigg Boss 5 Tamil Bigg Boss Season -5 : బిగ్‌బాస్ సీజన్-5 కి హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్..?

Bigg Boss Season -5 : బిగ్‌బాస్ సీజన్-5 కి హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్..?

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 10 వారాలు అంటే దాదాపు 78 రోజులు గడిచింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం.

ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఈ షో కేవలం తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా ప్రసారం అవుతుంది అన్న విషయం తెలిసిందే.

తమిళ్ లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ కి కమల్ హాసన్ గారు హోస్ట్ గా వ్యవహరిస్తారు. కమల్ హాసన్ గారు ఒక చిన్న అనారోగ్య సమస్యగా హాస్పిటల్ లో ఉన్నారు. దాంతో కొన్ని రోజులు షూటింగ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కి శృతి హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తారు అని సమాచారం. గతంలో కూడా తెలుగులో నాగార్జున షూటింగ్ పనిలో బిజీగా ఉన్నప్పుడు సమంత ఒక ఎపిసోడ్ కి హోస్ట్ గా వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు తమిళ్ లో కూడా ఇదే విధంగా కొన్ని ఎపిసోడ్స్ కి శృతి హాసన్ హోస్ట్ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి.

You may also like