అద్దెకి గది కావాలంటూ ఆ 14 ఏళ్ల అమ్మాయి అడిగేసరికి.. అనుమానంతో ఈ ఆటో డ్రైవర్ చేసిన పని చూస్తే హ్యాట్సాఫ్ అంటారు..

అద్దెకి గది కావాలంటూ ఆ 14 ఏళ్ల అమ్మాయి అడిగేసరికి.. అనుమానంతో ఈ ఆటో డ్రైవర్ చేసిన పని చూస్తే హ్యాట్సాఫ్ అంటారు..

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో మోసాలు చేస్తున్న ఆటో డ్రైవర్లని చూసాము కానీ ఇంత మంచి పని చేసిన ఆటో డ్రైవర్లని చూడలేదు. ఈ డ్రైవర్ చేసిన పనిని చూస్తే మెచ్చుకుంటారు. నిజానికి ఈ ఆటో డ్రైవర్ వల్ల ఒక అమ్మాయి తన ఇంటికి క్షేమంగా వెళ్ళింది. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే… మహారాష్ట్ర లోని పాలఘర్‌లోని వసాయి రైల్వే స్టేషన్ దగ్గర రాజు కర్వాడే అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. రోజు ప్రయాణికుల్ని ఎక్కించుకుని ఆటోలో తీసికెళ్ళి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు.

Video Advertisement

రోజూలానే ఆరోజు కూడా ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్నాడు రాజు. ఈ సమయంలో ఒక బాలిక అక్కడికి వచ్చింది. ఆమె వయసు 14 సంవత్సరాలు. ఒంటరిగా ఆటో దగ్గరకి ఆ బాలిక వచ్చింది. ఇక్కడ ఏమైనా గది అద్దెకి దొరుకుతుందా అని అడిగింది. ఆమె ఒంటరిగా వచ్చింది, వయస్సు చూస్తే చిన్నది అని ఆటోడ్రైవర్ ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అయితే ఆమె తల్లిదండ్రులతో గొడవపడి వచ్చేసినట్లు అతనికి అర్థమైంది.

అలానే ఆమెది ఢిల్లీ అని కూడా అతను తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ రాజు మానిక్‌పూర్‌ పోలీస్ స్టేషన్ కి బాలికను తీసుకుని వెళ్ళాడు. బాలిక చెప్పిన వివరాలను బట్టి ఢిల్లీలోని సాకేత్ పోలీసుల నుంచి వివరాలు అడిగి పోలీసులు తెలుసుకున్నారు. ఇక్కడ అమ్మాయి ఉంది అని ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాలిక తప్పిపోయిందని అక్కడి పోలీసులు చెప్పారు. ఆ తర్వాత పోలీసులు తల్లిదండ్రులకి చెప్పడంతో తమ పిల్లని తీసుకుని వెళ్లారు. అయితే ఆ బాలిక ఇంటికి క్షేమంగా వెళ్లడానికి కారణం ఆటో డ్రైవర్ రాజు. అతను చేసిన ఆ మంచి పనికి పోలీసులు అభినందించారు.


End of Article

You may also like