Home Filmy Adda ప్రభాస్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన… బాలీవుడ్ స్టార్..!

ప్రభాస్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన… బాలీవుడ్ స్టార్..!

by Megha Varna

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయినా విషయం తెలిసిందే. అయోధ్యలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగు తో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అయ్యింది. బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో విడుదల అవుతున్నాయి.

ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే విడుదల అవుతోంది. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఓం రౌత్ అంతకు ముందు తానాజీ సినిమాకి దర్శకత్వం వహించారు.

manchu vishnu comments on prabhas aadipurush..

ఆ సినిమా హిందీలో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. టీజర్ లో ప్రభాస్ తో పాటు వీరు కూడా కనిపిస్తున్నారు. రాముడిగా ప్రభాస్ లుక్ చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఈ సినిమా రన్ టైం వచ్చేసి 3 గంటల 16 నిమిషాలు అని టాక్ నడుస్తోంది. ఇంత రన్ టైమ్ సినిమాను ప్రేక్షకులు ఆనందిస్తారా లేదా అనేది చూడాలి.

fans getting doubts about aadipurush result

ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ “పఠాన్” సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది అని అంతా అనుకున్నారు. అయితే టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ఆదిపురుష్ రెస్పాన్స్ లో సగం లేదుట. ఆదిపురుష్ టీజర్ విషయానికి వస్తే.. ఆదిపురుష్ టీజర్ కి కేవలం హిందీ లో 68 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కానీ పఠాన్ కి మాత్రం హిందీలో కేవలం 17 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఆదిపురుష్ దరిదాపుల్లోకి కూడా పఠాన్ రాలేదు. కానీ సినిమా మాత్రం హిట్ అవుతుందని అంతా అంటున్నారు.

You may also like