ఇప్పుడు ఎక్కడ చూసినా ఇతని గురించి మాట్లాడుకుంటున్నారు… హీరో అనే పదం మీనింగ్ మార్చేశాడు..! ఎవరంటే..?

ఇప్పుడు ఎక్కడ చూసినా ఇతని గురించి మాట్లాడుకుంటున్నారు… హీరో అనే పదం మీనింగ్ మార్చేశాడు..! ఎవరంటే..?

by Harika

Ads

సాధారణంగా హీరో అవ్వాలి అంటే కొన్ని పరిమాణాలు ఉంటాయి. చూడడానికి బాగుండాలి అని, హైట్ గా ఉండాలి అని, డాన్స్ రావాలి, ఫైటింగ్స్ రావాలి ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ చేస్తే మాత్రమే హీరో అంటారు. ఒక నటుడు అవ్వాలి అంటే నటన వస్తే చాలు. కానీ ఒక హీరో అవ్వాలి అంటే మాత్రం పైన చెప్పినవన్నీ కూడా కచ్చితంగా వచ్చి ఉండాలి అనే ఒక మైండ్ సెట్ లో చాలా మంది ఉంటారు. అయితే అవి తప్పు అని తెలిసిన వారు కూడా ఉంటారు. హీరో అవ్వాలి అంటే తన నటనతో ఆ పాత్రకి న్యాయం చేయాలి అనేది ముఖ్యం.

Video Advertisement

ఆ పాత్ర చూస్తున్నంత సేపు, ఆ హీరో కాకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించాలి. ఆ పాత్ర చుట్టూ సినిమా తిరుగుతుంది అన్నప్పుడు అంత బాగా నటించాలి. ఆ పాత్రకి న్యాయం చేసిన వారే హీరో అవుతారు. అంతే కానీ సన్నగా ఉండడం, ఎత్తుగా ఉండడం ఇవన్నీ ఉంటేనే హీరో అవుతారు అనేది కేవలం అపోహ మాత్రమే. ఈ విషయాన్ని నిరూపించిన నటుడు సౌబిన్ షాహిర్. ఇతను మనలో కొంత మందికి తెలిస్తే, కొంత మందికి తెలియకపోవచ్చు.

this hero became sensation

 

పేరు తెలియకపోవచ్చు కానీ, మనిషిని చూస్తే మాత్రం మనలో చాలా మంది గుర్తుపడతారు. మలయాళం సినిమాల ద్వారా తెలుగులో అంత ఫేమస్ అయ్యారు. సౌబిన్ షాహిర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి, ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు. 2018 లో వచ్చిన సుడాని ఫ్రం నైజీరియా అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, ఇలా ఉంటే కూడా హీరో అవుతారు అని నిరూపించింది.

 

ఆ తర్వాత వచ్చిన కుంబలాంగి నైట్స్ అనే సినిమా సౌబిన్ షాహిర్ ని భారతదేశం అంతా ఫేమస్ చేసింది. ఈ సినిమా 2019 లో వచ్చింది. 2020 నుండి లాక్ డౌన్ మొదలైన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా కూడా చాలా మంది చూడడంతో అప్పటి నుండి సౌబిన్ షాహిర్ చాలా మందికి తెలిసిన నటుడు అయ్యారు. గత సంవత్సరం వచ్చిన రోమాంచం సినిమాలో మెయిన్ హీరోగా నటించారు. ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది.

 

ఇటీవల మంజుమ్మిల్ బాయ్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని తనే నిర్మించారు కూడా. 2017 లో పరవా అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయిన ఎన్నో మలయాళం నుండి తెలుగు డబ్బింగ్ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యారు. హీరో అన్న పదానికి అర్థం మార్చి, హీరో అంటే పాత్రకి న్యాయం చేసి, సినిమా తన భుజాల మీద మోసి, ప్రేక్షకులని సినిమా ఆసక్తికరంగా చూసేలా చేసిన వాడు అని నిరూపించారు.

ALSO READ : జరగండి పాటలో ఈ మిస్టేక్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?


End of Article

You may also like