అర్జున్ సినిమాలో “విశ్వక్ సేన్” స్థానంలో… ఆ హీరో చేయబోతున్నారా.?

అర్జున్ సినిమాలో “విశ్వక్ సేన్” స్థానంలో… ఆ హీరో చేయబోతున్నారా.?

by Mohana Priya

Ads

గత కొద్ది రోజుల నుండి హీరో విశ్వక్ సేన్ కి, సీనియర్ హీరో అర్జున్ కి మధ్య గొడవ అవుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో విశ్వక్ హీరోగా నటించాల్సి ఉంది. కానీ విశ్వక్ సేన్ సినిమా షూటింగ్ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత తనకి ఈ సినిమాకి సంబంధించి ఏవో చర్చలు చేయాలి అంటూ అర్జున్ కి చెప్పి షూటింగ్ కి రాలేను అని చెప్పారు అని, అంతే కాకుండా ఫోన్స్ కూడా ఎత్తలేదు అని అర్జున్ చెప్పారు.

Video Advertisement

కానీ ఈ విషయంపై విశ్వక్ సేన్ మాట్లాడుతూ, తాను అలా చేయడం తప్పు అని, కానీ ఈ సినిమా షూటింగ్ కి వెళుతూ ఉంటే భయం వేస్తోంది అని, అంతకు ముందు ఎప్పుడూ అలా అవ్వలేదు అని, ఇదే మొదటిసారి అలా అయ్యింది అని, దాంతో సినిమాకి సంబంధించి మాట్లాడాల్సి ఉంది అని షూటింగ్ ఆపాను అని, అది కేవలం ఒక్కరోజు మాత్రమే తర్వాత షూటింగ్ కంటిన్యూ చేద్దాం అని అనుకున్నాను అని చెప్పారు.

this hero to replace vishwak sen in arjun sarja movie

దాంతో ఈ విషయంపై కొద్ది రోజుల నుండి చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా నుండి విశ్వక్ సేన్ తప్పుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ ని అనుకుంటున్నారు అని సమాచారం. అర్జున్ శర్వానంద్ కి కథ వినిపించాలి అని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ శర్వానంద్ కి కథ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకుంటే షూటింగ్ చేద్దామని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ సినిమాపై మరొకసారి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఇందులో హీరోయిన్ గా అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ నటిస్తున్నారు.


End of Article

You may also like