గుంటూరు కారంలో స్పెషల్ సాంగ్ చేయనున్న తెలుగు బ్యూటీ..! ఎవరో తెలుసా…?

గుంటూరు కారంలో స్పెషల్ సాంగ్ చేయనున్న తెలుగు బ్యూటీ..! ఎవరో తెలుసా…?

by Mounika Singaluri

Ads

త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా వస్తున్న చిత్రం గుంటూరు కారం ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 తారీఖున విడుదల చేయనున్నారు.

Video Advertisement

హారిక అండ్ హాసిని బ్యానర్ పైన చినబాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

అయితే గుంటూరు కారం సినిమాల్లో ఒక ఐటెం సాంగ్ ఉంటుందని వార్త ఫిలింనగర్ లో హల్చల్ చేస్తుంది. మొన్నటి వరకు ఈ పాటలో మహేష్ సరసన పూజ హెగ్డే కాలు కదపనుంది అన్నారు. అయితే ఇప్పుడు మహేష్ పక్కన తెలుగు అమ్మాయి డాన్స్ చేయనుందని వార్త బయటకు వచ్చింది ఇంతకీ ఎవరా అమ్మాయి అనుకున్నారా….!

గద్దలకొండ గణేష్ లో ఐటెం సాంగ్ చేసిన హీరోయిన్ డింపుల్ హయాతి గురించి తెలిసిందే. ఆ సాంగ్ లో అమ్మడికి మంచి పేరు వచ్చింది. తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలో నటించింది. ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో మహేష్ పక్కన ఐటెం సాంగ్ లో ఈ అమ్మడు చేస్తుందని అంటున్నారు. ఇది ఎంత నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే డింపుల్ హయాతికి లక్కీ ఛాన్స్ దొరికినట్లే.


End of Article

You may also like